IPL 2024 : కోహ్లీ అవుట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన.. డివిలియర్స్!

ఐపీఎల్ 2024లో నిన్న జరిగిన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో కోహ్లీ వికెట్ మరో వివాదం అగ్గిరాజేస్తుంది.మాజీ క్రికెటర్లు, అభిమానులు కొత్త చర్చకు తెరలేపారు. తాజాగా ఈ అంశం పై మాజీ ఆర్సీబీ ఆటగాడు సౌతాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు.అదేంటో చదివేయండి!

New Update
IPL 2024 : కోహ్లీ అవుట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన.. డివిలియర్స్!

De Villiers : ప్రస్తుతం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL 2024) లో అమలవుతున్న రూల్స్‌, ఉపయోగిస్తున్న టెక్నాలజీలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటికే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌పై టీమ్‌ ఇండియా(Team India) కెప్టెన్‌ రోహిత్ శర్మ(Rohit Sharma), మాజీ క్రికెటర్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(KKR) వర్సెస్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) మ్యాచ్‌లో కోహ్లి(Virat Kohli) ఔట్‌ అయిన తీరుపై, అంపైర్‌లు తీసుకున్న నిర్ణయంపై సౌతాఫ్రికా, ఆర్సీబీ మాజీ ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెట్‌లో మెరుగవ్వాల్సిన అంశాలను ప్రస్తావిస్తూ ట్వీట్‌ చేశాడు.

ఏప్రిల్‌ 21న ఆదివారం మధ్యాహ్నం కోల్‌కతా, ఈడెన్‌ గార్డెన్స్‌లో కేకేఆర్ వర్సెస్‌ ఆర్సీబీ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. కేకేఆర్‌ 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 222 భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ 221 పరుగులకు ఆలౌట్‌ అయింది. కేవలం ఒక్క పరుగు తేడాతో టోర్నీలో ఏడో ఓటమి మూటగట్టుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లి అవుట్‌ అయిన తీరు వివాదాస్పదమవుతోంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి తప్పుడు నిర్ణయంతో పెవిలియన్‌ చేరాల్సి వచ్చిందని, ఇలాంటి సంఘటనలతో టీమ్‌లు కీలక మ్యాచ్‌లు కోల్పోవాల్సి వస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భారీ పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీకి కోహ్లి, డుప్లెసిస్‌ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కోహ్లి భారీ షాట్‌లతో విరుచుకుపడ్డాడు. అయితే మూడో ఓవర్‌ మొదటి బంతిని కేకేఆర్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణా, హై ఫుల్‌ టాస్‌ వేశాడు. కోహ్లి క్రీజు బయటకు వచ్చి ఆడాడు, బాల్ నేరుగా హర్షిత్ రాణా చేతుల్లోకి వెళ్లింది. కాట్‌ అండ్ బౌల్డ్‌గా అంపైర్‌ ప్రకటించాడు. ఈ నిర్ణయంపై కోహ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాల్‌ నడుము కంటే ఎత్తులో ఉందనేది కోహ్లి వాదన. వెంటనే అతను రివ్యూ కోరాడు.

అయితే అప్పటికే ఫీల్డ్ అంపైర్లు థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. థర్డ్ అంపైర్ విజువల్స్‌ని చెక్‌ చేసి ఔట్‌గా ప్రకటించాడు. కోహ్లి క్రీజు బయటకు రాకపోయి ఉంటే ఫుల్‌టాస్‌ స్లోయర్‌ బాల్‌, క్రీజుల నడుము కిందకి డ్రాప్‌ అయ్యేదని అంపైర్‌ అభిప్రాయపడ్డాడు. డెలివరీని ఎదుర్కొనేందుకు క్రీజు బయటకు వచ్చిన కోహ్లిని అవుట్‌గా ప్రకటించాడు. దీనిపై విరాట్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. కోపంగా మైదానం వీడాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి ఏడు బంతుల్లో 18 పరుగులు చేశాడు. అందులో ఒక 4, రెండు సిక్స్‌లు ఉన్నాయి.

ఏబీ డివిలియర్స్ క్రికెట్‌లో లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. KKR vs RCB క్లాష్‌లో విరాట్ కోహ్లీ అవుట్‌ అయిన తీరుపై స్పందిస్తూ, ఈ లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. బాల్ ట్రాకింగ్, ఇతర టెక్నాలజీలను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించాడు.బాల్ నడుము కంటే ఎత్తులో ఉందా లేదా అనేది కనిపెట్టేందుకు గందరగోళాన్ని క్లియర్ చేయడానికి డ్రాయింగ్ లైన్‌తో పాటు బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని తప్పనిసరిగా ఉపయోగించాలని ఏబీడీ చెప్పాడు. ఆటలోని లోపాలు కోపం, గందరగోళానికి కారణమవుతాయని, వీటిని దూరం చేసేందుకు, సరైన నిర్ణయాలు తీసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని సూచించాడు.

Also Read : యంగ్ క్యాండిడేట్స్.. గుకేశ్ రికార్డ్

Advertisment
Advertisment
తాజా కథనాలు