International:పదేళ్ళ పిల్లను కిరాతకంగా హింసించి చంపిన కేర్ టేకర్స్

హవాయ్‌లోని హోనోలూలులో పదేళ్ళ పాప మత్య సంచలనం సృష్టించింది. పాపాకు కేర్ టేకర్‌గా ఉంటున్న వాళ్ళే హింసించి అతి కిరాతకంగా చంపడం అక్కడి పోలీసులను విస్తుపోయేలా చేసింది. దీనికి కారణమైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

International:పదేళ్ళ పిల్లను కిరాతకంగా హింసించి చంపిన కేర్ టేకర్స్
New Update

Hawaii:కొంతమంది ఉంటారు. మానవత్వం అనేది మచ్చుకకు అయినా కనిపించదు. మరమనుషులకైనా కొంత జాలా, దయ, కరుణ ఉంటాయేమో కానీ వీళ్లకి మాత్రం అవేమీ ఉండవు. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే హవాయ్‌లోని హోనోలూలుకు చెందిన బ్రాండీ, థామస్ బ్లాస్, డిబ్రా గెరోన్‌లు. వీళ్లు మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు. 10 చిన్నారిని చిత్రహింసలు పెట్టి చంపేసిన కిరాతకులు. వీరిని హోనోలూలు పోలీసుల అరెస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే...

జియన్నా బ్రాడ్లీ అనే పదేళ్ళ అమ్మాయికి బ్రాండీ, థామస్, డెబ్రాలు కేర్ టేకర్‌లుగా ఉన్నారు. హవాయ్ గవర్నమెంట్ చిన్న పిల్ల సంరక్షణ కోసం నెలకు 1961 డాలర్లు ఇస్తుంది. పిల్లలను ఎవరు చూసుకుంటే వాళ్లకు ప్రభుత్వం ఇస్తుంది. తల్లిదండ్రులైనా సరే. జియన్నాకు కేర్ టేకర్లుగా ఉన్న ఈ ముగ్గరూ ప్రతీ నెల ఆ సొమ్మను తీసుకుంటున్నారు కూడా. అయితే వీళ్ళు పరమ దుర్మార్గులు. పాపను సంర్ఖించడానిక డబ్బులు తీసుకుని కూడా ఆమెను కిరాతకంగా హంఇసించి చంపేశారు. జియన్నా చేతులను విరిచి వెనక్కు కట్టేశారు. మొహం నిండా గాయాలు చేశారు. ముక్కు మీద కొట్టడం వలన జియన్నా ముక్కులో కొంత భాంగ లేకుండా కూడా పోయింది. ఇలా నానా బాధలు పెట్టారు .

Also Read:China:రెండు గంటల్లో 1250 కి.మీ..చైనా వండర్ ట్రైన్

పాపను హింసించి చంపిన వారిలో థామస్, గెరోన్‌లు ఇద్దరూ భార్యా భర్తులు . వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అది కాక వీరు మరో నాలుగేళ్ళ పిల్లాడిని దత్తత కూడా తీసుకున్నారు. అయితే వీరికి పిల్లలు కేవలం గవర్నమెంటు ఇచ్చే డబ్బులు కోసం మాత్రం. జియాన్నాను సంరక్షించే బాధ్యతులు తీసుకుంది కూడా అందుకే. మొత్తం పిల్లలందరికీ వచ్చే డబ్బులతో థామస్, గెరోన్, డెబ్రాలు ఎంజాయ్ చేసేవారు కానీ పిల్లలను మాత్రం సరిగ్గా చూసుకునే వారు కాదు. పైగావారిని హింసించే వారు. అది కాస్త ఎక్కువవడంతో జియన్నా చనిపోయింది. వీళ్ళు దత్తత తీసుకున్న నాఉలగేళ్ళ పిల్లాడు కూడా చాలా అనారోగ్యంగా ఉన్నాడు. దెబ్బలతో, తిండి లేక సన్నగా అయిపోయి ఉన్నాడు.

సెల్ ఫోన్‌లో దొరికిన ఆధారాలు..

థామస్, గెరోన్ , డెబ్రాలను హోనోలూలు పోలీసులు అరెస్ట్ చేశారు. దీని తర్వాత వారి విచారణను చేస్తున్నప్పుడు వారికి నమ్మలేని నిజాలు తెలిసాయి. జియన్నా ఏడీహెచ్డీ అమ్మాయి. అంటే మానసికంగా తక్కువ ఎదుగుదల ఉన్న అమ్మాయి అని చెప్పారు థామస్ దంపతులు. అయితే తాము ఆమెకు ట్రీట్ చేయిస్తున్నామని తెలిపారు. ఏడీహెచ్డీ కారణంగా జియన్నా సరిగ్గా ఉండేది కాదని...అందుకే దెబ్బలు తగిలాయని చెప్పారు. కానీ థామస్, మిగతా వారి ఫోన్ల ఆధారంగా అసలు నిజం తెలుసుకున్నారు. వాటిల్లో జియన్నాను చిత్రహింసలు పెట్టిన వీడియోలు, ఫోటోలు కనిపించాయి. వాటిల్లో పాపను టేప్‌తో కట్టేయడం..కొట్టడం లాంటివి షూట్ చేసి ఉన్నాయి. దీంతో థామస్ దంపతులు, డెబ్రానే కలిసి జియన్నాను చంపేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

#10-years-kid #hololulu #murder #hawaii #usa
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe