ఆ రాష్ట్రానికి ఎవరూ వెళ్లకండి.. అక్కడ ఉంటే తిరిగిరండి: కేంద్రం

భారత్, మయన్మార్‌ల సరిహద్దులో 1,643 కిలోమీటర్ల పొడవుగా కంచెను నిర్మించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అలాగే మయన్మార్‌లోని రఖైన్‌ రాష్ట్రానికి వెళ్లొద్దని.. అక్కడ ఎవరైన భారతీయులు ఉంటే తిరగొచ్చేయాలని కేంద్రం సూచించింది.

New Update
ఆ రాష్ట్రానికి ఎవరూ వెళ్లకండి.. అక్కడ ఉంటే తిరిగిరండి: కేంద్రం

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. భారత్, మయన్మార్‌ల సరిహద్దులో 1,643 కిలోమీటర్ల పొడవుగా కంచెను నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సరిహద్దు వెంట గస్తీ మార్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ' భారత్, మయన్మార్ సరిహద్దు వెంట పూర్తిగా కంచెను నిర్మిస్తాం. మణిపుర్‌లో మోరేలో ఇప్పటికే 10 కిలోమీటర్ల వరకు కంచె వేశాం. అలాగే హైబ్రిడ్ నిఘా వ్యవస్థ ద్వారా మణిపుర్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో కిలోమీటరు చొప్పున ఫెన్సింగ్ ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టులు కొనసాగుతున్నట్లు.. ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.

Also read: నేడు ఏపీ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌..

పెరిగిన అక్రమ చొరబాట్లు

మన దేశ ఈశాన్య రాష్ట్రాలైన మణిపుర్, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌లు మయన్మార్‌తో సరిహద్దును కలిగి ఉన్నాయి. ఇదివరకు సరిహద్దు నుంచి ఇరువైపులా కూడా 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండానే ప్రజలు వెళ్లే అవకాశం ఉండేది. కానీ మయన్మార్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడిన ఘటనలు పెరిగిపోయాయి. వీటిని నివారించేందుకు ఆ దేశ సరిహద్దు వెంట కంచె వేస్తామని గత నెలలోనే అమిత్‌ షా అన్నారు.

వెనక్కి వచ్చేయండి

ఇదిలాఉండగా.. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ భారత ప్రజలకు ఓ కీలక సూచన చేసింది. ప్రస్తుతం మయన్మార్‌లో ఉంటున్న రఖైన్‌ రాష్ట్రానికి వెళ్లొద్దని చెప్పింది. అంతేకాదు ఒకవేళ ఆ రఖైన్ రాష్ట్రంలో ఎవరైనా ఉంటే వెంటనే వెనక్కి వచ్చేయాలని తెలిపింది.

Also Read: ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు.. ప్రసంగంలో ఈ అంశాలే టార్గెట్‌..

Advertisment
Advertisment
తాజా కథనాలు