Leopard: మహానందిలో మరోసారి చిరుత సంచరించింది.దీంతో మనుషుల ప్రాణాలు పోయేంత వరకు కూడా చిరుతను పట్టుకోరా అంటూ మహానంది ప్రజలు అటవీశాఖ తీరు తెన్నుల పై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున అడవిలోని కృష్ణ నంది క్షేత్రానికి వెళ్లే పాత రస్తా నుంచి 4.30 గంటలకు క్షేత్రంలోని గోశాల వద్ద చిరుత కొంతసేపు ఆగి రథమార్గం గుండా అడవిలోకి వెళ్లి పోయింది.
మహానందిలో చిరుత్య తిరుగుతుండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మహానందిలోని పార్వతీపురం, అరటితోటల్లో సంచరిస్తుండడంతో కోతులు, కుక్కలు విపరీతంగా అరవడాన్ని అక్కడి ప్రజలు గమనించారు.
అటవీశాఖాధికారులు చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకోకపోవడం పై స్థానికులు అసహనాన్ని వెలిబుచ్చుతున్నారు.