Mahanandhi: మహానందిలో మరోసారి చిరుత కలకలం!
నంద్యాల జిల్లాలోని మహానంది దేవస్థానం వెనుక గోశాల వద్ద శుక్రవారం రాత్రి 8:50 గంటల సమయంలో చిరుత పులి సంచరించినట్లు దేవస్థానం అధికారులు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్నారు.
నంద్యాల జిల్లాలోని మహానంది దేవస్థానం వెనుక గోశాల వద్ద శుక్రవారం రాత్రి 8:50 గంటల సమయంలో చిరుత పులి సంచరించినట్లు దేవస్థానం అధికారులు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్నారు.
మహానందిలో మరోసారి చిరుత సంచరించింది.దీంతో మనుషుల ప్రాణాలు పోయేంత వరకు కూడా చిరుతను పట్టుకోరా అంటూ మహానంది ప్రజలు అటవీశాఖ తీరు తెన్నుల పై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
AP: ఉమ్మడి కర్నూల్ జిల్లాలో చిరుత టెన్షన్ కలవరపెడుతోంది. మహానంది ఆలయ వెనుక భాగంలో మరోసారి చిరుత ప్రత్యేక్షమైంది. గత 5 రోజులుగా ఆలయ పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆలయానికి వచ్చే భక్తులను అలర్ట్ చేశారు అధికారులు.