IT Jobs: ఐటీలో చేరాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. 90 వేల కొత్త ఉద్యోగాలు 2024-2025 ఆర్థిక ఏడాదిలో దాదాపు 90 వేల మంది కొత్తవారిని పలు దిగ్గజ ఐటీ కంపెనీలు చేర్చుకోనున్నాయి. టీసీఎస్ 40 వేలు, ఇన్ఫోసిస్ 15-20 వేలు, HCL 10 వేలు, విప్రో 10-12 వేలు, టెక్ మహింద్ర 6 వేల మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగ అవకాశాలివ్వనున్నాయి. By B Aravind 26 Jul 2024 in జాబ్స్ నేషనల్ New Update షేర్ చేయండి ప్రస్తుతం ఐటీ రంగంలో ఆర్థికమాంద్యం కొనసాగతున్న సంగతి తెలిసిందే. చాలా కంపెనీలు కొత్తవారిని ఎక్కువగా చేర్చుకోవడం లేదు. పలు కంపెనీలు ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఐటీలో చేరాలనుకునేవారికి పలు కంపెనీలు గుడ్‌న్యూస్ తెలిపాయి. ఈ ఆర్థిక ఏడాది పలు దిగ్గజ ఐటీ కంపెనీలు 90 వేల మంది కొత్తవారికి ఉద్యోగాలు కల్పించనున్నాయి. Also Read: భారీ వర్షాలు.. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న 50 మంది యాత్రికులు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS) 2024-25 ఆర్థిక ఏడాదిలో 40 వేల మంది కొత్తవారికి ఉద్యోగ అవకాశాలివ్వాలని ప్లాన్ చేస్తోంది. అలాగే ఇన్ఫోసిస్ కూడా ఈ ఆర్థిక ఏడాది 15 వేల నుంచి 20 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ 10 వేల మంది కొత్తవారిని క్యాంపసెస్ నుంచి తీసుకోనుంది. అలాగే విప్రో కంపెనీ కూడా ఈ ఆర్థిక ఏడాది 10 వేల నుంచి 12 వేల మంది ఫ్రెషర్స్‌ను చేర్చుకోనుంది. మరోవైపు టెక్ మహింద్రా కూడా ఈసారి 6 వేల మంది ఫ్రెషర్స్‌ను తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించింది. దీంతో 2024-2025 ఆర్థిక ఏడాదికి దాదాపు 90 వేల మంది కొత్తవారికి ఐటీలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. Also Read: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి.. ఈ ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో టీసీఎస్ 5,452 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 6,06,998 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇక ఇన్ఫోసిస్ 2023-2024 ఆర్థిక ఏడాదిలో 11,900 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంది. 2022-23లో 50 వేల మందికిపైగా తమ కంపెనీలో చేర్చుకోగా.. 2023-2024 ఏడాదికి ఏకంగా 76 శాతం తగ్గించింది. అయితే ఈసారి తాము 20 వేల మంది వరకు కొత్తవారిని తీసుకుంటామని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షిల్ అధికారి జయేష్ సంగ్‌రాజ్క తెలిపారు. #it-jobs #tcs #infosis #wipro #tech-mahindra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి