Ramoji Rao: రామోజీ మృతికి రేవంత్, చంద్రబాబు, జూ.ఎన్టీఆర్ తో పాటు ప్రముఖుల సంతాపం!

ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణానికి ప్రముఖులు అందరూ సంతాపం తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి తదితరులు సంతాపం తెలియజేశారు.

New Update
Ramoji Rao: రామోజీ మృతికి రేవంత్, చంద్రబాబు, జూ.ఎన్టీఆర్ తో పాటు ప్రముఖుల సంతాపం!

Leaders Tweet On Ramoji Rao death:మీడియా మొఘల్ రామోజీరావు మరణం పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అన్నారు.

తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుంది.తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది అంటూ సంతాపాన్ని వ్యకంత చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

రామోజీరావు మరణం తనను చాలా బాధపెట్టింది అంటూ సంతాపం తెలియజేశారు ప్రధాని నరేంద్రమోదీ. తెలుగు పత్రికల్లో విప్లవాన్ని తీసుకువచ్చిన గొప్పవ్యక్తి అని పొగిడారు.

వీరితో పాటూ మెగాస్టార్ చిరంజీవి, జూ.ఎన్టీయార్ తదితరులు కూడా రామోజీరావు మరణానికి సంతాపాన్ని తెలియజేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం అంటూ వారి కుటుంబ సభ్యలు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Also Read:Ramoji Rao: ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడు.. మీడియా మొఘల్ రామోజీరావు

Advertisment