Lavanya Tripathi Going To Be A Mother : మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) గుడ్ న్యూస్ చెప్పబోతుందా? అంటే అవుననే అంటున్నారు మెగా ఫ్యాన్స్. తాజాగా లావణ్య తన సోషల్ మీడియా (Social Media) లో పెట్టిన ఓ పోస్ట్ చూసి తాను తల్లి కాబోతున్నట్లు (Pregnant) ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చిందంటూ చెబుతున్నారు. ఇంతకీ లావణ్య పెట్టిన పోస్ట్ ఏంటి?
వివరాల్లోకి వెళ్తే.. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ (Varun Tej) ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఇరు కుటుంబాలు వీరి పెళ్ళికి ఓకే చెప్పడంతో గత ఏడాది నవంబర్ ఇటలీలో ఈ జంట గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అటు వరుణ్ ఇటు లావణ్య సినిమాలతో బిజీ అయ్యారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా షూటింగ్ తో బిజీగా ఉండగా.. లావణ్య రీసెంట్ గా మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో పలకరించింది. పెళ్లి తర్వాత సెలెక్టివ్ గా ప్రాజెక్ట్స్ చేస్తున్న ఈమె ప్రెజెంట్ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.
Also Read : అది రేవ్‌పార్టీ కాదు.. నటి ఆషీరాయ్ సరికొత్త ట్విస్ట్..
ఆ ఫోటోకి అర్థం అదేనా?
లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందని ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తాజాగా లావణ్య ఓ చిన్న పిల్లాడితో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ఆమె తల్లి కాబోతుందని, ఇదే విషయాన్ని ఇలా ఇన్ డైరెక్ట్ గా చెప్పిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే లావణ్య తల్లి కాబోతుందా? అనేది తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అంత వరకు వేచి చూడాల్సిందే..