Lavanya Tripathi And Varun Tej Wedding:
ఏర్పాట్లు చకచకా
ఈ సంవత్సరం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోనే పెళ్లి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న జంట.. పెళ్లి మాత్రం ఇటలీలో(Italy) ఫ్లాన్ చేశారు. అయితే ఈ జంట ఇటలీలోనే వివాహం చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఏ సంప్రదాయంలో వీరిద్దరి వివాహం జరగనుందనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది. వరుణ్, లావణ్యల ప్రేమ ఇటలీలోనే ప్రారంభమైందట. అందుకే ఇటలీని ఎంచుకున్నారట. ఇక లావణ్య త్రిపాఠిది రాజవంశమట. కాబట్టి రాచరిక సంప్రదాయంలో వీరిద్దరి వివాహం జరగనుందని టాక్.
హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ - Lavanya Tripathi And Varun Tej Reception:
అయితే వివాహమైన వారం రోజుల తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తారట. నిజానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. నిజం కూడా కావొచ్చు. ఏది ఏమైనా వివాహం జరిగితే కానీ క్లారిటీ రాదు. ఇక లావణ్య, వరుణ్ తేజ్‌లు రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారట. ఎప్పటి నుంచో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ టాక్ నడుస్తున్నా ఇద్దరూ కొట్టిపారేయడంతో అంతా సైలెంట్ అయిపోయారు. సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్‌గానే లావణ్య త్రిపాఠితో నిశ్చితార్ధం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . నాగబాబు నివాసంలో అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితులు,స్నేహితులు మధ్య వీళ్ల నిశ్చితార్ధం గ్రాండ్‌గా జరిగింది.
ఇటలీలోనే వివాహం
నిజానికి నవంబర్‌లో వీళ్లు పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారట. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఆ పెళ్లి ముహూర్తాన్ని ఆగస్టు చివరి వారంలో పెట్టుకునేలా మార్చుకున్నారు. దానికి తగ్గట్టే రీసెంట్‌గా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇటలీలో కలిసి తిరిగిన పిక్స్ వైరల్ అవ్వడంతో వీళ్ళ పెళ్లి పనుల కోసమే ఇటలీకి వెళ్లారు అన్న పుకార్లు ఎక్కువగా స్ప్రెడ్ అవటంతో.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్‌గా మారింది.