NTR 31 : సెప్టెంబర్ లో సెట్స్ పైకి 'NTR31'.. తారక్ లేకుండానే షూటింగ్

#NTR31 సినిమా మూవీకి సంబంధించి ఓ వార్త వైరల్‌గా మారింది. ఈ సినిమా సెప్టెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుందట. మొదటి షెడ్యూల్‌ ఎన్టీఆర్‌ లేకుండానే ప్లాన్‌ చేస్తున్నారట. ‘దేవర’ షూటింగ్‌ పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.

New Update
NTR 31 : సెప్టెంబర్ లో సెట్స్ పైకి 'NTR31'.. తారక్ లేకుండానే షూటింగ్

NTR - Prashanth Neel Movie : పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రానున్న సినిమా #NTR31 సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ మూవీకి సంబంధించి ఓ వార్త వైరల్‌గా మారింది. అదేంటంటే, ఈ సినిమా సెప్టెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుందట. అంతేకాదు మొదటి షెడ్యూల్‌ ఎన్టీఆర్‌ లేకుండానే ప్లాన్‌ చేస్తున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా (Devara Movie) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘దేవర’ సినిమా తొలి భాగం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్’ సిరీస్, ‘సలార్’ సినిమాలు భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Also Read : శేఖర్ మాస్టర్ కుటుంబంలో విషాదం.. మిస్ యు రా అంటూ పోస్ట్ ..!

మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్న ఈ సినిమాకు 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. యూరప్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఏ సినిమాలో ఎన్టీఆర్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించనున్నట్టు టాక్ వినిపిస్తుంది.

Advertisment
తాజా కథనాలు