SSMB29 : రాజమౌళి - మహేష్ మూవీలో హీరోయిన్ ఫిక్స్.. సూపర్ స్టార్ కోసం బాలీవుడ్ బ్యూటీ!

'SSMB 29' ప్రాజెక్ట్ లో మహేష్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు తెలిసింది. ఈ మూవీలో జాన్వీ కపూర్ మహేష్ కి బాగా సెట్ అవుతుందని భావించి, ఆమెనే హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

SSMB29 : రాజమౌళి - మహేష్ మూవీలో హీరోయిన్ ఫిక్స్.. సూపర్ స్టార్ కోసం బాలీవుడ్ బ్యూటీ!
New Update

Rajamouli - Mahesh Babu SSMB 29 Movie : ‘RRR’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత S S రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులు చక చకా జరుగుతున్నాయి. త్వరలోనే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని రాజమౌళి కూడా అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వస్తూనే ఉంటుంది.

publive-image

ఈసినిమా కోసం మహేష్ కూడా రెడీ అవుతున్నారు. ఇప్పటికే తన లుక్ను మార్చుకున్నారు. జుట్టును పెంచారు. దాంతో పాటూ బాడీ బిల్డింగ్ కూడా చేస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీలో పలువురు హాలీవుడ్ యాక్టర్స్ నటిస్తున్నట్లు రీసెంట్ గా వార్తలు వినిపించాయి. కాగా ఈ సినిమాలో మహేష్ కి జోడిగా హాలీవుడ్ హీరోయిన్, ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఇస్లాన్ నటిస్తున్నట్లు వార్తలు రాగా.. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ ని రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది.

publive-image

Also Read : విశ్వక్ సేన్ మాస్ జోరు.. రెండో రోజే అన్ని కోట్లు రాబట్టిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’!

మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ...

లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. 'SSMB 29' ప్రాజెక్ట్ లో మహేష్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు తెలిసింది. ఈ మూవీలో జాన్వీ కపూర్ మహేష్ కి బాగా సెట్ అవుతుందని భావించి, ఆమెనే హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో సౌత్ లోకి ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్.. ఈ మూవీ రిలీజ్ అవ్వకుండానే రామ్ చరణ్ లేటెస్ట్ మూవీలో ఛాన్స్ అందుకుంది.

publive-image

ఇక ఇప్పుడు ఏకంగా రాజమౌళి - మహేష్ కాంబోలో తెరకెక్కబోయే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే మాత్రం జాన్వీ కపూర్ దశ తిరిగినట్లే. కాగా దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుమారు రూ.1000 కోట్లకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

publive-image

#mahesh-babu #ssmb-29-movie #actress-janhvi-kapoor
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి