Pushpa 3 : బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'పుష్ప' పార్ట్-3 పై అదిరిపోయే అప్డేట్

'పుష్ప' పార్ట్ 3 కి సంబంధించి ఓ వార్త నెట్టింట ట్రెండ్‌ అవుతోంది. 'పుష్ప2' క్లైమాక్స్‌లో 'పార్ట్‌-3'కి లీడ్‌ ఇస్తూ సీన్స్ చూపిస్తారట. 'పుష్ప3' కచ్చితంగా ఉంటుందని చిత్ర సన్నిహితవర్గాలు తెలిపాయి. రెండు, మూడేళ్ల తర్వాతే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

New Update
Pushpa 3 : బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'పుష్ప' పార్ట్-3 పై అదిరిపోయే అప్డేట్

Pushpa Part-3 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' బాక్సాఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ సక్సెస్ అవ్వడంతో పాటూ అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు ను కూడా తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ 'పుష్ప 2' కోసం సినీ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఏడాదిగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం మూవీ టీమ్ క్లైమాక్స్ ను చిత్రీకరించే పనిలో ఉన్నారు.

ఇదిలా ఉంటే పుష్ప 2 తర్వాత పార్ట్ - 3 కూడా ఉండబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే కదా. బెర్లిన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా అల్లు అర్జున్‌ కూడా పార్ట్ - 3 ఉంటుందని స్పష్టం చేశారు. ఇక తాజాగా పార్ట్ - 3 కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట ట్రెండ్‌ అవుతోంది. 'పుష్ప2' క్లైమాక్స్‌లో 'పార్ట్‌-3'కి లీడ్‌ ఇస్తూ కొన్ని సన్నివేశాలను చూపిస్తారట. 'పుష్ప3' కచ్చితంగా ఉంటుందని చిత్ర సన్నిహితవర్గాలు తెలిపాయి.

Also Read : క్యాస్టింగ్ కౌచ్ దెబ్బకు మోహన్ లాల్ రాజీనామా.. మలయాళ ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది?

అయితే, రెండో భాగం పూర్తయిన వెంటనే మాత్రం అది పట్టాలెక్కదని అంటున్నారు. రెండు, మూడేళ్ల తర్వాతే ‘పార్ట్‌3’కి అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటు సుకుమార్‌, అటు అల్లు అర్జున్‌కు వేరే కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి. అవి పూర్తి చేయడానికి కచ్చితంగా రెండేళ్లు కావాల్సిందే. ఆ తర్వాతే ‘పార్ట్‌3’కి సంబంధించిన పనులు మొదలవుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Advertisment
తాజా కథనాలు