/rtv/media/media_files/2025/12/17/sarpanch-elections-2025-final-2025-12-17-07-25-27.jpeg)
- Dec 17, 2025 14:47 IST
ప్రారంభమైన కౌంటింగ్
మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
- Dec 17, 2025 13:30 IST
సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం వాయిదా
- Dec 17, 2025 13:01 IST
తెలంగాణాలో ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్
- ఒంటి గంట దాకా నడిచిన తుది దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్
- 1గం. క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటేసే అవకాశం
- 2గం. నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ
- మరికాసేపట్లో ఓటింగ్ శాతంపై రానున్న స్పష్టత
- Dec 17, 2025 12:59 IST
ఓటు కోసం వెళ్లి ప్రమాదానికి గురైన దంపతులు
ములుగు జిల్లా
- ఓటు కోసం వెళ్లి ప్రమాదానికి గురైన దంపతులు.
- వెంకటాపూర్ మండలం నర్సాపూర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడ్డ కారు.
- అల్వాల అపర్ణ అక్కడికక్కడే మృతి, భర్త దేవేందర్‌కు గాయాలు.
- భూపాలపల్లి సింగరేణిలో పనిచేస్తున్న దేవేందర్ స్వగ్రామం నర్సంపేట మండలంలోని గురిజాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి తిరిగి భూపాలపల్లి వెళ్తుండగా ప్రమాదం.
- మృతదేహాన్ని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
- కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు.
- Dec 17, 2025 12:30 IST
రాష్రవ్యాప్తంగా 60 శాతం పోలింగ్
నిజమాబాద్
జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్.
11 గంటల వరకు 53.69 శాతం పోలింగ్ నమోదు.
కామారెడ్డి
జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్. 11 గంటల వరకు 56.71
- Dec 17, 2025 12:29 IST
రంగారెడ్డి జిల్లా
- మంచాల మండలం అస్మత్పూర్ వార్డులో ఉద్రిక్తత.
- కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్‌లో ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం.
- బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.
- పరస్పరం దాడులు చేసుకున్న రెండు పార్టీల కార్యకర్తలు.
- Dec 17, 2025 12:28 IST
11 గంటల వరుకు రాష్రవ్యాప్తంగా 60 శాతం పోలింగ్ జరిగింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.
- Dec 17, 2025 11:45 IST
ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు
ఖమ్మం జిల్లా
- ఏన్కూరు మండల పరిధిలోని కొత్త మేడేపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు.
- గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్.
- గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఓటింగ్‌ను బహిష్కరించిన గ్రామస్తులు.
- తమ గ్రామ సమస్యలు పరిష్కారం చేస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామంటున్న ఓటర్లు.
- కల్లూరు మండలం చెన్నూరులో ఓ ఇంటర్నెట్ దుకాణంలో డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు.
- 95000 నగదు ను సీజ్ చేసి నిర్వహకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలింపు.
- సత్తుపల్లి మండలం బెతుపల్లి గ్రామం లో ఓటు వేసి ఇంటికి వెళ్తుండగా గుండెపోటుకు గురైన సత్యనారాయణ(65) అనే వృద్ధుడు.
- ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి.
- Dec 17, 2025 11:44 IST
ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎస్పీ
జగిత్యాల జిల్లా
- గొల్లపల్లి మండలకేంద్రంలో ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
- Dec 17, 2025 11:44 IST
7 గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ శాతం 28.32 శాతం
జోగులాంబ గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాలలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ శాతం 28.32 శాతం
అలంపూర్ 29.00 శాతం
మానవపాడు 23.73 శాతం
ఉండవెల్లి 28.81 శాతం
ఇటిక్యాల 26.81 శాతం
ఎర్రవల్లి 33.16 శాతం
కరీంనగర్
కొనసాగుతున్న చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం జగిత్యాల 21.74
- పెద్దపల్లి 22.50 శాతం
- కరీంనగర్ 20.66 శాతం
- రాజన్న సిరిసిల్ల 18.69 శాతం
- Dec 17, 2025 11:07 IST
నాగర్ కర్నూలు
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చారగొండ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా 9 గంటలకు 27% పోలింగ్ అయినట్లు అధికారులు తెలిపారు
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ బూతు వద్ద భారీ బందోబస్తు
నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట నియోజకవర్గంలో 3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9.00 గంటల సమయానికి సగటున 25.70శాతం పోలింగ్ నమోదు.
మండలాల వారీగా.. అచ్చంపేట... 27.45%
అమ్రాబాద్...25.26%
బల్మూర్... 22.04
లింగాల.. 27.16
ఉప్పునుంతల ...25.80
పదార....25.29
చారకోండ ....27.73
- Dec 17, 2025 10:34 IST
నల్లగొండ జిల్లా
- మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 29.06 శాతం పోలింగ్ నమోదు
- Dec 17, 2025 10:34 IST
9 గంటల వరకు 21.27 శాతం నమోదైన పోలింగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 9 గంటల వరకు 21.27 శాతం నమోదైన పోలింగ్.వికారాబాద్
వికారాబాద్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 21.86 శాతం పోలింగ్ నమోదు
- Dec 17, 2025 10:27 IST
పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తత
సూర్యాపేట జిల్లా
నేరేడుచర్ల మండలం ఎల్బీ నగర్, దర్శించర్ల పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తత
పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహిస్తున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వివాదం
ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం
- Dec 17, 2025 10:18 IST
తెలంగాణలో రికార్డ్.. ఈ ఊరిలో ఒక్క ఓటుకు రూ.లక్షా 50వేలు
- Dec 17, 2025 10:16 IST
సంగారెడ్డి జిల్లా
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం
- నారాయణఖేడ్ 24.08%
- కంగ్టి 30.01%
- మానూర్ 25.05%
- నాగల్ గిద్ద 26.02%
- సిర్గాపూర్ 28.04%
- కల్హేర్ 26.7%
- నిజాంపేట్ 20.03%
- Dec 17, 2025 10:15 IST
నిజామాబాద్ జిల్లా
మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 9 గంటల వరకు 23.35 శాతం పోలింగ్ నమోదు.
- Dec 17, 2025 10:15 IST
పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారి, కలెక్టర్
వరంగల్ జిల్లా
నర్సంపేట, నెక్కొండ. చెన్నారావుపేట, ఖానాపురం మండలాల్లో ఏర్పాటు చేసిన ఆకుపచ్చని హరిత పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద.
- Dec 17, 2025 09:55 IST
ఓటేసేందుకు లండన్ నుంచి వచ్చి..
/fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/12/17/london-student-2025-12-17-10-12-31.jpeg)
అబ్దుల్లాపూర్ మెట్: లండన్‌లో ఎంఎస్ చదువుతున్న విద్యార్థి లవణ్ కుమార్ తెలంగాణలో జరుగుతున్న మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్‌లో ఆయన ఓటు వేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
- Dec 17, 2025 09:46 IST
ఉదయం 9 గంటలు.. 24 పోలింగ్ శాతం నమోదు
- తెలంగాణ లో కొనసాగుతున్న తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
- 3,752 పంచాయతీలు, 28, 410 వార్డులకు కొనసాగుతున్న పోలింగ్
- ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24 పోలింగ్ శాతం నమోదు
- మధ్యాహ్నాం 1గం. దాకా పోలింగ్
- 2గం. నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్
- సాయంత్రం కల్లా వెలువడనున్న ఫలితాలు
- వీలైతే ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నికలు.. కుదరకుంటే రేపే!
- Dec 17, 2025 09:45 IST
సూర్యాపేటలో మండలాల వారీగా పోల్ అయిన వివరాలు
సూర్యాపేట జిల్లా
- సూర్యాపేట జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొదటి రెండు గంటలలో ( ఉదయం 7:00 గంటల నుండి 9:00 గంటల వరకు )మండలాల వారీగా పోల్ అయిన వివరాలు శాతంలలో చింతలపాలెం - 26.84 % గరిడేపల్లి - 25.18 % హుజూర్నగర్ - 20.66 % మట్టంపల్లి - 27.74 % మేళ్లచెర్వు - 23.48 % నేరేడుచర్ల - 21.02 % పాలకవీడు - 26.70 %జిల్లాలో పోలింగ్ సరాసరి.. 24.83 %
- Dec 17, 2025 09:44 IST
నందిపేటలో పోటెత్తిన ఓటర్లు
నిజామాబాద్
- నందిపేటలో పోటెత్తిన ఓటర్లు.
- ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చిన మహిళా ఓటర్లు.
- నందిపేట పోలింగ్ కేంద్రంలో 10 వేలకు పైగా ఓటర్లు.
- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో బారులు తీరిన ఓటర్లు.
- Dec 17, 2025 09:44 IST
400 మంది పైగా ప్రచారం చేస్తున్న అభ్యర్థుల మద్దతుదారులు
పెద్దపల్లి జిల్లా- ఓదెల మండల కేంద్రంలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 100 మీటర్ల అవతల పెద్ద ఎత్తున 400 మంది పైగా ప్రచారం చేస్తున్న అభ్యర్థుల మద్దతుదారులు.
- అభ్యర్థుల మద్దతుదారులు 144 సెక్షన్ ఉల్లంఘించారని ఆరోపణ.
- ఘటన స్థలానికి చేరుకొని ప్రజలను వెనుకకు పంపిస్తున్న గోదావరిఖని ఏసిపి రమేష్.
- Dec 17, 2025 08:57 IST
తెలంగాణ పల్లెల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న మూడో విడత సర్పంచ్ ఎన్నికలు
తెలంగాణ పల్లెల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న మూడో విడత సర్పంచ్ ఎన్నికలు
— Telugu Scribe (@TeluguScribe) December 17, 2025
మధ్యాహ్నం 2 గంటల తరువాత వెలువడనున్న తుది ఫలితాలు pic.twitter.com/xwUQIFyMv7 - Dec 17, 2025 08:54 IST
ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు
జోగులాంబ గద్వాల జిల్లా
అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు,ఎర్రవల్లి,ఇటిక్యాల, ఉండవెల్లి,అలంపూర్ మండలాలలో మూడో విడత ఎన్నికల్లో 75 గ్రామ పంచాయతీలగాను 7 గ్రామపంచాయతీలో ఏకగ్రీవం కాగా మిగిలిన 68 గ్రామపంచాయతీలో కొనసాగుతున్న పోలింగ్.
- Dec 17, 2025 08:54 IST
ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు
నారాయణపేట జిల్లా
మక్తల్ నియోజకవర్గంలోని నర్వ మండలంలో ప్రారంభమైన మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్.
తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న గ్రామస్తులు.
- Dec 17, 2025 08:53 IST
ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు
వనపర్తి జిల్లా
పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాలలో మొదలైన మూడో విడత పోలింగ్.
- Dec 17, 2025 08:53 IST
ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు
మహబూబ్‌నగర్ జిల్లా
మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జడ్చర్ల బాలానగర్ మండలాల పరిధిలో పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మూడో విడత స్థానిక సంస్థలోఎన్నికల సందర్భంగా ఉప్పునుంతల మండలం లోని పలు గ్రామాలలో మొదలైన పోలింగ్.
- Dec 17, 2025 08:48 IST
తుది విడత ఎన్నికల వివరాలు
- జిల్లాలు- 31
- మండలాలు- 182
- నోటిఫికేషన్ ఇచ్చిన జీపీలు- 4,159
- నామినేషన్లు రాని జీపీలు- 11
- ఏకగ్రీవమైన జీపీలు- 394
- ఎన్నికలు నిలిచిన జీపీలు- 2
- పోలింగ్ జరిగే జీపీలు- 3,752
- పోటీలో ఉన్న అభ్యర్థులు- 12,652
- నోటిఫికేషన్ ఇచ్చిన వార్డులు- 36,452
- నామినేషన్ల రాని వార్డులు- 116
- ఏకగ్రీవమైన వార్డులు- 7,908
- ఎన్నికలు నిలిచిన వార్డులు- 18
- పోలింగ్ జరిగే వార్డులు- 28,410
- పోటీలో ఉన్న అభ్యర్థులు- 75,725
- పోలింగ్ స్టేషన్ల సంఖ్య- 36,483
- మొత్తం ఓటర్ల సంఖ్య- 53,06,401
- Dec 17, 2025 07:49 IST
ఎన్నికల నిర్వహణకు లక్షకు పైగా సిబ్బంది
- Dec 17, 2025 07:44 IST
ఉమ్మడి వరంగల్ లో మూడో విడత పంచాయతీ ఎన్నికలు
- Dec 17, 2025 07:41 IST
ములుగు జిల్లా ఏజెన్సీలో అదనపు భద్రత ఏర్పాటు
- Dec 17, 2025 06:59 IST
ALERT: చివరి విడత పోలింగ్ ప్రారంభం
- Dec 17, 2025 06:56 IST
లాస్ట్ ఫేజ్ పంచాయతీ..3,752 సర్పంచ్, 28,410 వార్డు స్థానాలకు ఎన్నికలు
- 3,752 సర్పంచ్, 28,410 వార్డు స్థానాలకు ఎన్నిక
- ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్
- లంచ్ బ్రేక్ తర్వాత కౌంటింగ్.. ఆ వెంటనే విజేతల ప్రకటన
- ఇప్పటికే 394 సర్పంచ్, 7,908 వార్డులు ఏకగ్రీవం
- ర్యాలీలు, సభలు, ఊరేగింపులు బంద్.. రేపటి వరకు 163 సెక్షన్ అమలు
- Dec 17, 2025 06:53 IST
సర్పంచి బరిలో తల్లీకూతురు
- Dec 17, 2025 06:53 IST
22 ఏళ్లకే ఓ యువతి సర్పంచ్
- Dec 17, 2025 06:53 IST
మూడో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం
Follow Us
/fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/12/17/shankarpalli-2025-12-17-10-52-20.jpeg)
/fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)