-
Jan 07, 2025 08:17 IST
జర్నలిస్ట్ ముకేశ్ హత్య కేసులో వెలుగులోకి భయానక విషయాలు..
బీహార్ జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్ హత్య కేసులో భయానక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతన్ని చంపేసిన తర్వాత గుండెను బయటకు తీసి...కాలేయాన్ని నాలుగు ముక్కలు చేశారు. 15 చోట్ల తల పగిలేలా కొట్టి.. పక్కటెముకలు, మెడ విరిచి దారుణంగా హత్య చేశారు.
-
Jan 07, 2025 07:53 IST
Bengaluruలో విషాదం.. పిల్లలకు విషం ఇచ్చి.. భార్యాభర్తలు ఆత్మహత్య
బెంగళూరులో ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జరిగింది. ఐటీ ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి పిల్లలకు విషం ఇచ్చి భార్యాభర్తలు ఉరి వేసుకున్నారు. ఆర్థిక సమస్యల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
-
Jan 07, 2025 07:52 IST
ఇలా తయారయ్యారేంట్రా : అందమైన ఫొటోలకు టెంప్ట్.. కోట్లు పోగొట్టుకున్నారు
మ్యాట్రిమోనీ, డేటింగ్ యాప్‌లను ఆధారంగా చేసుకుని ఫేక్ ఫోటోలు పెట్టి బడాబాబులతో పరిచయం పెంచుకుని కోట్ల రూపాయలను కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్‌లో 12 ,సైబరాబాద్ లో 53, రాచకొండలో 40పైగా ఇలాంటి కేసులు అయ్యాయని పోలీసులు వెల్లడించారు.
-
Jan 07, 2025 07:51 IST
బంగారం కొనాలనుకుంటున్నారా?.. ఈ రోజు మార్కెట్లో తులం ఎంతంటే?
సోమవారంతో పోల్చుకుంటే ఈ రోజు (జనవరి 7న) బంగారం ధరల్లో పెద్దగా మార్పులు ఏమీ లేవు. జనవరి 07వ తేదీ ఉదయం 6 : 30 గంటలకు 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ. 100 తగ్గింది. ఇక 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గింది.
-
Jan 07, 2025 07:50 IST
భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై ఎంత తీవ్రతంటే?
నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. గోకర్ణేశ్వర్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదైంది. చైనా, బంగ్లాదేశ్, భూటాన్, భారత్‌లో కూడా భూకప్రకంనలు వచ్చాయి. ఇండియాలో ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం.
-
Jan 07, 2025 07:44 IST
దేశంలో కొత్త వైరస్ వ్యాప్తి.. ఏపీ ఆరోగ్యశాఖ అలర్ట్
ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై సమీక్ష నిర్వహించారు. పక్క రాష్ట్రాలలో కేసులు నమోదైన నేపథ్యంలో అప్రమత్తతతో ఉండాలన్నారు. ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని,కిట్లు, ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
🔴 LIVE BREAKINGS: జర్నలిస్ట్ ముకేశ్ హత్య కేసులో వెలుగులోకి భయానక విషయాలు..
New Update
తాజా కథనాలు