🛑LIVE BREAKINGS: రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఆనందంలో ఎగ్జిబీటర్లు.. అయోమయంలో నిర్మాతలు? By Manoj Varma 23 Dec 2024 | నవీకరించబడింది పై 23 Dec 2024 21:38 IST in Latest News In Telugu New Update BREAKING NEWS షేర్ చేయండి Dec 23, 2024 21:38 IST రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఆనందంలో ఎగ్జిబీటర్లు.. అయోమయంలో నిర్మాతలు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వమని సంచలన ప్రకటన చేశారు. ఆయన నిర్ణయంతో టాలీవుడ్ పెద్దలు ఇప్పుడు తలలు పట్టు కుంటుంటే సినిమా ఎగ్జిబీటర్లు మాత్రం తెగ ఖుషీ అవుతున్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. revanth reddy on tollywood Dec 23, 2024 21:12 IST హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు క్వాష్ పిటిషన్స్! మేడిగడ్డ బ్యారేజీ ఇష్యూపై బీఆర్ఎస్ నేత కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రాజెక్టు అవకతవకలపై భూపాలపల్లి కోర్టు జూలైలో పంపిన నోటీసులు కొట్టివేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. Also Read : https://rtvlive.com/telangana/kcr-harish-rao-quash-petitions-in-telangana-high-court-telugu-news-8555523 Dec 23, 2024 21:08 IST శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్స్ ఏమన్నారంటే? కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వెంటిలేటర్, ఆక్సిజన్ లేకుండానే స్వయంగా ఊపిరి తీసుకోగలుగుతున్నాడని తెలిపింది. తనంతట తాను ఫుడ్ కూడా తీసుకోగలుగుతున్నాడని వెల్లడించింది. Revanth reddy, Sri tej (File Photo) Dec 23, 2024 21:07 IST ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ మృతి Dec 23, 2024 21:06 IST అల్లు అర్జున్‌కి మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు చిక్కడిపల్లి పోలీసు స్టేషన్‌కు హాజరు కావాలని పోలీసులు తెలిపారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. aAAA Photograph: (aAAA) Dec 23, 2024 19:34 IST శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టుకి సమీపంలో నిర్మాణంలో ఉన్న అమర్‌రాజా బ్యాటరీ కంపెనీ మూడో అంతస్తులో మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే అధికారులు అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. Shamshabad Air port Photograph: (Shamshabad Air port) Dec 23, 2024 19:22 IST సంధ్య థియేటర్ ఘటన.. వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటున్నారు : విజయశాంతి సంధ్య థియేటర్ ఘటనపై సినీయర్ హీరోయిన్, కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని చెప్పిన ఆమె..రాజకీయ స్వార్థం కోసం ఈ ఘటనను ఉపయోగించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. vijayashanti about sandhya theatre incident Dec 23, 2024 19:03 IST ముట్టుకున్నా ఊరుకోం.. బౌన్సర్లకు సీపీ ఆనంద్ వార్నింగ్! బౌన్సర్లను, ప్రైవేట్ బాడీ గార్డ్స్ ను, వీరిని నియమిస్తున్న ఏజెన్సీలను హెచ్చరించిన హైదరాబాద్ సీపీ @CPHydCity సామాన్యప్రజలపై దాడులు సహించబోము. బౌన్సర్ల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వారిపై, నిర్వాహకులపై కూడా అత్యంత కఠినచర్యలు తీసుకుంటాం. @CVAnandIPS #TelanganaPolice pic.twitter.com/mfor76UYii — Telangana Police (@TelanganaCOPs) December 22, 2024 Dec 23, 2024 19:01 IST శ్రీతేజ్ కోసం విదేశాల నుంచి వైద్యులు 'శ్రీతేజ్ కోసం విదేశాల నుంచి వైద్యులు' Dec 23, 2024 17:52 IST శ్రేతేజ్ ఫ్యామిలీకి మైత్రీ మూవీస్ రూ.50 లక్షల సాయం సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను పుష్ప2 నిర్మాత నవీన్ తో కలిసి సినీ, ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పరామర్శించారు. ఇకపై ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని, సినీ అభిమానుల ఇళ్లపై దాడులు చేయవద్దని కోమటిరెడ్డి… pic.twitter.com/Ao21DVt9hB — RTV (@RTVnewsnetwork) December 23, 2024 Dec 23, 2024 11:36 IST అల్లు అర్జున్ ఇష్యూలో బిగ్ ట్విస్ట్.. సారీ చెప్పిన హైదరాబాద్ సీపీ! హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు క్షమాపణలు చెప్పారు. నేషనల్ మీడియాను ఉద్దేశించి ఆదివారం తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ట్వీట్ చేశారు. సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలిపారు. Dec 23, 2024 09:52 IST అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ట్వీట్! అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ట్వీట్ చేశారు. Dec 23, 2024 09:51 IST అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఆరుగురికి రిమాండ్ అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో మెజిస్ట్రేట్ ఆరుగురికి రిమాండ్ విధించింది. దాడి చేసిన వారిని రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్‌గా జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. Dec 23, 2024 07:46 IST అమెరికాలో అనుమానాస్పద స్థితి హనుమకొండ విద్యార్థి మృతి అమెరికాలో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన బండి వంశీ అనుమానాలకు దారి తీస్తోంది. నిన్నరాత్రి అతను ఉంటున్న అపార్ట్‌మెంట్ గ్రౌండ్‌లో ఫ్లోర్‌లో కారు సీట్లో శవమై కనిపించాడు. Dec 23, 2024 07:45 IST ఇళ్లను ఢీకొట్టి కుప్పకూలిన విమానం..10 మంది మృతి! బ్రెజిల్ లో ఓ చిన్న విమానం ఇళ్లను ఢీకొట్టి కూలిపోవడంతో సుమారు 10 మంది ప్రయాణికులు మృతిచెందారు.మరో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పర్యాటక పట్టణమైన గ్రామడోలో ఈ ఘటన జరిగింది. Dec 23, 2024 07:45 IST ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలలో మరో రెండ్రోజులు వానలే వానలు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారగా.. ప్రస్తుతం ఆ వాయుగుండం బలహీనపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. Dec 23, 2024 07:16 IST ఏపీలో దారుణం.. క్లాస్‌రూమ్‌లో ఉండగానే టీచర్ కిడ్నాప్ ఏపీలో దారుణం జరిగింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో టీచర్ కిడ్నాప్ కలకలం రేపింది. క్లాస్‌రూమ్‌లో ఉండగానే మునీర్ అహ్మద్ అనే టీచర్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి