Harish Rao : హైదరాబాద్‌కు బయలుదేరిన హరీష్ రావు

జన సందోహం మధ్య హరీష్ రావు హైదరాబాద్ కు బయలుదేరారు. మద్దతుగా నిలిచిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు హరీష్ రావు. రాష్ట్ర డీజీపీ తమతో మాట్లాడి కౌశిక్‌రెడ్డి ఇంటి మీద దాడి చేసిన వారి మీద 307 కింద కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు.

author-image
By Manogna alamuru
harish rao
New Update

Harish Rao :

జన సందోహం మధ్య హరీష్ రావు హైదరాబాద్ (Hyderabad) కు బయలుదేరారు. మద్దతుగా నిలిచిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు హరీష్ రావు. రాష్ట్ర డీజీపీ తమతో మాట్లాడి కౌశిక్‌రెడ్డి ఇంటి మీద దాడి చేసిన వారి మీద 307 కింద కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ ఇవ్వడాన్ని ఖండించిన కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యే ఇంటి‌పైన దాడి చేసిన విధానాన్ని మీరంతా చూశారు.ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి (Koushik Reddy) ఇంటి‌పైన దాడి జరిగిందని, చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మమ్మల్ని అరెస్ట్ చేశారు. మనది తెలంగాణ ఉద్యమ పార్టీ పోరాటం చేస్తే తెలంగాణ సాధించిన పార్టీ. తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకునే పార్టీ మనది.ఒకవైపు పెద్ద ఎత్తున గణేష్ నిమర్జనం జరుగుతుంది. హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు డీజీపీ హామీ మేరకు మనందరం ఇక్కడి నుంచి వెళ్లడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినా కార్యకర్తలకు, నాయకులకు ఎన్ని రకాల కృతజ్ఞతలు చెప్పిన తక్కువే అన్నారు హరీష్ రావు.కొద్ది నిమిషాల్లోనే మమ్మల్ని అరెస్ట్ చేసి ఇటు వైపు తీసుకొస్తున్నారని తెలవగానే మీ ప్రాణాలకు తెగించి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు.

తెలంగాణ (Telangana) తెచ్చిన పార్టీగా బాధ్యత గల శాసనసభ్యులుగా లా అండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకొని మేం సహకరిస్తున్నామని హరీష్ రావు తెలిపారు..టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద జరిగిన దాడిపై కూడా చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీనిచ్చారు.పోలీసులు కూడా కార్యకర్తలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మీ మాట మీద నిలబడాలని కోరుతున్నాను. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వద్ద ఉండొచ్చు రేపు మా దగ్గర ఉండొచ్చు.. కానీ ధర్మాన్ని న్యాయాన్ని పాటించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.మేము వెళ్లిపోయిన తర్వాత కార్యకర్తలని పోలీసులు ఇబ్బంది పెడితే తిరిగి మళ్లీ ఇక్కడికి వచ్చి నిరసన తెలపాల్సివస్తుంది.కార్యకర్తలు ఎంతో ఇబ్బందిపడి అన్నం తినకుండా ఇక్కడ వేచి ఉన్నారు. వారంతా తిరిగి గమ్యస్థానానికి క్షేమంగా చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.ప్రభుత్వ మెడలు వంచి రైతు రుణమాఫీ కావాలి, ఆసరా పెన్షన్లు రావాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి మనం పోరాటం కొనసాగిద్దాం. జిల్లాలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలని బైండోవర్ చేశారని సమాచారం వచ్చింది.

Also Read :  పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చాం.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

#telangana #harish-rao #brs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe