Navy Jobs: పరీక్ష లేకుండానే ఉద్యోగం.. 56వేల జీతంతో ఇండియన్ నేవీలో జాబ్స్..! షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 254 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ జాబ్‌కు ఎంపిక అయితే బేసిక్ పే రూ. 56100 నుంచి మొదలవుతుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. By Trinath 03 Mar 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Indian Navy - Short Service Commission Jobs: ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 254 ఖాళీలను భర్తీ చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేవీ joinindiannavy.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేసి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 24న నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మార్చి 10, 2024. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 254 SSC ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి: --> ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్: 136 పోస్టులు --> ఎడ్యుకేషన్ బ్రాంచ్: 18 పోస్టులు --> టెక్నికల్ బ్రాంచ్: 100 పోస్టులు అర్హత ప్రమాణం: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా సబ్జెక్టులో B.E/B.Tech డిగ్రీని కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియ: డిగ్రీ సాధారణ మార్కుల ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ ఉంటుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ విషయాన్ని ఈ-మెయిల్ లేదా SMS ద్వారా తెలియజేస్తారు. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్‌లో ఫిట్‌గా ఉన్న అభ్యర్థులు అడ్మిషన్లో ఖాళీల లభ్యత ప్రకారం నియమిస్తారు. వేతనం: బేసిక్ పే రూ. 56100 నుంచి మొదలవుతుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు ఇక్కడ లింక్‌పై క్లిక్ చేయండి. Also Read: నిరుద్యోగులకు అలెర్ట్.. 1,025 పోస్టుల దరఖాస్తుకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి! WATCH THIS VIDEO: #latest-jobs #indian-navy #indian-navy-recruitment #jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి