Israel-Hamas: ఇజ్రాయెల్, హమాస్ మధ్య సజావుగా కొనసాగుతున్న బందీల విడుదల..

ఇజ్రాయెల్‌,హమాస్‌ మధ్య ఒప్పందంలో భాగంగా బందీల విడుదల సాగుతోంది. ముందుగా హమాస్ 13 మంది ఇజ్రాయెలీలు, నలుగురు థాయ్‌లాండ్ వాసులను శనివారం అర్థరాత్రి విడుదల చేసింది. ఆ తర్వాత హమాజ్‌ 39 మంది పాలస్తీనా వాసుల్ని జైలు నుంచి విడుదల చేసింది.

Israel-Hamas: ఇజ్రాయెల్, హమాస్ మధ్య సజావుగా కొనసాగుతున్న బందీల విడుదల..
New Update

ఇజ్రాయెల్, హమాస్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారలేదు. హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌.. గాజాపై భీకర దాడులు జరుపుతోంది. అయితే తాజాగా రెండో విడత బందీల విడుదల సజావుగా సాగింది. ముందుగా హమాస్ 13 మంది ఇజ్రాయెలీలు, నలుగురు థాయ్‌లాండ్ వాసులను శనివారం అర్థరాత్రి విడుదల చేసింది. అయితే వారందరూ ఇప్పుడు ఇజ్రాయెల్‌కు చేరుకున్నట్లు ఆ దేశ మిలటరీ పేర్కొంది. అయితే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి తర్వాత వాళ్ల కుటుంబాలకు అప్పగిస్తామని పేర్కొంది. హమాస్‌ తమ దగ్గర ఉన్న బందీలను విడుదల చేసిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ కూడా 39 మంది పాలస్తీనా వాసులను జైలు నుంచి విడుదల చేసింది. అయితే వీళ్లందరూ జెరుసలెంతో పాటు వెస్ట్‌బ్యాంక్‌లో తమ సొంత ప్రాంతాలకు వెళ్లనున్నారు. వీరిని తీసుకొని వెళ్లిన రెడ్‌క్రాస్‌ ఇంటర్నేషనల్ బస్సు ఆదివారం ఉదయం వెస్ట్‌బ్యాంకుకు చేరిందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

Also read: టన్నెల్ కార్మికులు మరికొన్ని వారాలు అందులోనే ఉండాలా..?

అయితే హమాస్ విడుదల చేసిన బందీల్లో ఏడుగురు చిన్నపిల్లలు, ఆరుగురు మహిళలు ఉన్నారని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కార్యాలయం పేర్కొంది. ఒప్పందంలో భాగంగా నాలుగు రోజుల్లో హమాస్‌ 50 బందీలుగా ఉన్నవారని విడుదల చేయగా.. ఇజ్రాయెల్‌ 150 మంది పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్‌ విడుదల చేసింది. ఇప్పటికే రెండు రోజులు పూర్తయ్యాయి. ఇందులో తొలి దశలో భాగంగా థాయ్‌లాండ్‌కు చెందిన 10 మందిని, ఓ ఫిలిప్పీన్స్‌ పౌరుడ్ని హమాస్‌ విడుదల చేసింది. రెండో దశలో కాస్త ఆలస్యం జరిగింది. గాజాకు మానవతా సాయం అందించడంలో ఆలస్యం జరిగిందని.. దీంతో బందీల విడుదల అనుకున్న సమయానికి కావడం లేదని హమాస్‌ పేర్కొంది. మొదటిరోజున శుక్రవారం 24 మందికి హమాస్‌ స్వేచ్ఛ కల్పించగా.. ఇజ్రాయెల్‌ 39 మంది పాలస్తీనా పౌరుల్ని విడుదల చేసింది.

Also Read: మా దేశం విడిచివెళ్లాలంటే రూ.69 వేలు కట్టాల్సిందే..

#israel-attack #telugu-news #hamas-israel-war #hamas-vs-israel
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe