SBI Jobs : స్టేట్ బ్యాంక్‌లో 8,283 ఉద్యోగాలు.. దరఖాస్తుకు కొన్ని గంటలే సమయం!

8,283 క్లర్క్‌ పోస్టుల ఖాళీల భర్తీకి SBI గత నవంబర్‌ 17న దరఖాస్తులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల అప్లికేషన్‌ గడువు ఇవాళ్టి(డిసెంబర్‌ 10)తో ముగియనుంది.

New Update
SBI Jobs : స్టేట్ బ్యాంక్‌లో 8,283 ఉద్యోగాలు.. దరఖాస్తుకు కొన్ని గంటలే సమయం!

SBI Junior Associate : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీని పొడిగించిన విషయం . తమ దరఖాస్తులను ఇంకా సమర్పించని వారందరూ ఇవాళ(డిసెంబర్ 10) లోపు అప్లై చేసుకోవచ్చు. క్లర్క్ పోస్టుల కోసం 8,283 ఖాళీల భర్తీకి ఈ డ్రైవ్ జరుగుతోంది. రాతపూర్వక (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూలో అభ్యర్థుల పనితీరు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. చివరిగా ఎంపికైన అభ్యర్థులను తదుపరి నియామక ప్రక్రియ కోసం పిలుస్తారు. అభ్యర్థులు ముఖ్యమైన తేదీలు, అర్హతలు, ఎంపిక ప్రమాణాలు ఇతర వివరాలను కింద చెక్‌ చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు:
--> దరఖాస్తు(Notification) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం - నవంబర్ 17
--> దరఖాస్తు నమోదు ముగింపు - డిసెంబర్ 10
--> దరఖాస్తు వివరాలను సవరించడానికి ముగింపు - డిసెంబర్ 10
--> మీ దరఖాస్తును ప్రింట్ చేయడానికి చివరి తేదీ - డిసెంబర్ 25
--> ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు - నవంబర్ 17 నుంచి డిసెంబర్ 10 వరకు

స్థానిక భాషల్లోనూ ఎగ్జామ్:
ఇక ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష (Preliminary Exam) జనవరిలో, మెయిన్‌ పరీక్ష (Mains) ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరీక్ష ఇంగ్లీష్‌, హిందీతో పాటు స్థానిక భాషల్లోనూ రాసుకునే వెలుసుబాటు కల్పించారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, ఉర్దూ భాషల్లో రాయొచ్చు.

మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులకు, న్యూమరికల్‌ ఎబిలిటీ విభాగం నుంచి 35 ప్రశ్నలకు 35, రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలకు 35 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఒక గంట సమయం. నెగిటివ్‌ మార్కులున్నాయి. ప్రతి తప్పుకు 1/4 మార్కులను తొలగిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే ప్రధాన పరీక్షకు ఎంపిక అనుమతిస్తారు. మెయిన్‌ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది.

Also Read: టీమిండియాకు సఫారీల సవాల్‌.. తొలి టీ20కు ప్లేయంగ్‌ టీమ్‌ ఇదే!

WATCH:

Advertisment
తాజా కథనాలు