Health Tips : లేట్‌ నైట్‌ తినవద్దు.. ఎందుకో తెలుసుకోండి.. మళ్లీ ఆ పని చేయరు!

లేట్‌ నైట్ తినడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఆలస్యంగా డిన్నర్ చేయడం వల్ల బరువు పెరుగుతారు, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. అధ్యయనల ప్రకారం రాత్రి 12 తర్వాత డిన్నర్ చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.

New Update
Health Tips : లేట్‌ నైట్‌ తినవద్దు.. ఎందుకో తెలుసుకోండి.. మళ్లీ ఆ పని చేయరు!

కొంతమందికి లేట్‌ నైట్‌ డిన్నర్‌(Late Night Dinner) చేసే అలవాటు ఉంటుంది. ఆఫీస్‌ నుంచి ఆలస్యంగా రావడం లేదా అశ్రద్ధ చేయడం లాంటి కారణాల వల్ల అలా లేట్‌గా తింటుంటారు. మరికొందరు ఫోన్‌ని ఎక్కువగా యూజ్‌(Phone Usage) చేస్తూ తిండి గురించే మరిచిపోతారు. ఇంకొదరు టీవీ షోలు(TV Shows) చూస్తూ లేట్‌గా తినడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైనా ఒకసారి సందర్భానికి తగ్గట్టుగా నలుగురితో లేట్‌గా తింటే సమస్య ఉండదు కానీ నిత్యం ఆలస్యంగా తినడం అలవాటు చేసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు(Health Problems) వస్తాయి. ఇక లేట్ నైట్ వర్క్‌ లేదా టీవీ షోలు వాటితో మునిగిపోయిన తర్వాత ఆకలి బాగా వేస్తుంది. ఆ టైమ్‌లో హెవీ ఫుడ్‌ తింటారు. కొంతమంది జంక్‌ ఫుడ్స్‌(Junk Foods) తింటారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు.

ఆలస్యంగా తినడం ఎందుకు మంచిది కాదో తెలుసుకోండి:

రోజంతా ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాన్ని తిని.. రోజులో ఒకే ఒక సారి రాంగ్‌ టైమ్‌లో తినడం వల్ల యూజ్‌ లేకుండా పోతుంది. ప్రొటీన్ అధికంగా ఉండే కార్బ్ డైట్, మనం చేసే వ్యాయామం, మనం ఉంచుకునే క్యాలరీ చెక్ అన్నీ ఒకే భోజనం వల్ల పాడైపోతాయి.

చాలా మందికి లేట్‌గా తినకూడదని తెలుసు.. కానీ లేట్‌ టైమ్‌ అని దేన్ని డిఫైన్ చేస్తారో తెలీదు. నిజానికి ఒక నిర్ధిష్ట సమయానికి తినడం లేట్‌ అని ఎక్కడా లేదు. మన నిద్రకు మూడు గంటల ముందు తింటే సరైన సమయానికి ఆహారం తీసుకున్నట్టు లెక్క. తినిన మూడు గంటల్లోనే నిద్రపోతే అది బాడీలో ఫాట్‌లాగా పేరుకుపోతుంది. కొన్నాళ్లుకు జీర్ణ సమస్యలు వస్తాయి. అది చివరికి అనారోగ్యం పాలయ్యేలా చేస్తుంది. ఇది స్టార్టింగ్‌లో తెలియనప్పటికీ తర్వాతి రోజుల్లో అర్థమవుతుంది.

మిడ్‌నైట్‌ తినడం నిద్రవేళతో సంబంధం లేకుండా ముప్పే. అధ్యయనల ప్రకారం రాత్రి 12 తర్వాత డిన్నర్ చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.

రాత్రి ఆలస్యంగా తినడం వల్ల ప్రధానంగా ఐదు సమస్యలున్నాయి:

నిద్రకు అంతరాయం: ఆలస్యంగా తినే వ్యక్తులు సాధారణంగా ఆలస్యంగా నిద్రపోతారు. ఇది స్లీప్‌ సైకిల్‌కి భంగం కలిగిస్తుంది.

జీర్ణక్రియ: మీరు లేట్ నైట్ డిన్నర్ చేస్తే ఇది అనేక గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. ఎందుకంటే ఆహారం సరిగా జీర్ణం అవ్వదు. కడుపులో యాసిడ్ అధికంగా స్రవిస్తుంది.

బరువు పెరగడం: రాత్రి సమయంలో మీ శరీర జీవక్రియ మందగిస్తుంది. అలాగే.. ఇది పగటి కేలరీలను బర్న్ చేయడంలో అంత ప్రభావవంతంగా ఉండదు. అందువల్ల, ఆలస్యంగా తినడం బరువు పెరగడానికి దారితీస్తుంది.

మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

రక్తపోటు పెరగడం: రాత్రిపూట ఆలస్యంగా తినడం, నిద్రపోకవడం రక్తపోటు, డయాబెటిస్‌కు దారితీస్తుంది.

ALSO READ: రంజాన్‌ మాసంలో ఖర్జూరం పండుకు ఎందుకు అంత ప్రాముఖ్యతో తెలుసా!

Advertisment
తాజా కథనాలు