EAPCET : తెలంగాణ(Telangana) లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహించే టీఎస్ ఈఏపీసెట్-2024(TS EAPCET)కు దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఫిబ్రవరి 26న ఈ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 6వ తేదీతో ముగియనుంది. ఆలస్య ఫీజు లేకుండా అప్లే చేసుకునేందుకు విద్యార్థులకు ఇంకా రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల వివరాలను జేన్‌ఎన్టీయూ-హెచ్(JNTU-H) విడుదల చేసింది. ఇప్పటివరకు ఇంజినీరింగ్ విభాగంలో 2,33,517 మంది, అగ్రికల్చర్/ఫార్మా విభాగాల్లో 87,819 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. మూడు విభాగాలకు 268 మంది అప్లే చేసుకన్నట్లు పేర్కొంది. దీంతో ఈఏపీ సెట్ (TS EAPCET)కు మొత్తం 3,21,604 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది.
Also Read : ఉప్పల్ స్టేడియానికి కరెంట్ సరఫరా నిలిపివేత.
అయితే గత ఏడాది మూడు విభాగాలకు కలిపి మొత్తం 3,20,683 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి మాత్రం గడువు ముగియకముందే గతేడాది సంఖ్య కన్నా ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఈఏపీ సెట్ రాయాలనుకునేవారికి విద్యార్థులు ఏప్రిల్ 6లోగా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చని జేఎన్టీయూ-హెచ్ తెలిపింది. ఇదిలా ఉండగా.. ఈఏపీ సెట్ పరీక్షలు రాష్ట్రంలో మే 7 నుంచి 11 వరకు జరగనున్నాయి. మే 7,8 తేదీల్లో అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలు, మే 9,10,11 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలను ఉన్నత విద్యామండలి రిషెడ్యూల్ చేసింది. ఈఏపీ సెట్‌కు అప్లై చేసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి