Kerala: భయపెడుతున్న కొండచరియలు.. బండరాళ్ల కింద నలుగుతున్న బతుకులు

ప్రపంచవ్యాప్తంగా ఏటా కొండచరియలు విరిగిపడిన ఘటనలో చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2000-2019 వరకు ప్రపంచవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో దాదాపు 55,000 మంది మరణించారు.

New Update
Kerala: భయపెడుతున్న కొండచరియలు.. బండరాళ్ల కింద నలుగుతున్న బతుకులు

కేరళలోని వయనాడ్‌లో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 200 మందికి పైగా మృతి చెందారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల్లో చిక్కుకున్న వారని సిబ్బంది వెలికితీస్తున్నారు. మరికొంతమంది ఆచూకీ లేకుండా పోయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది కొండచరియలు విరిగిపడిన ఘటనలో చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగడం ఆందోళన కలిగిస్తోంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. నివేదికల ప్రకారం 2000-2019 మధ్య ప్రపంచవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో దాదాపు 55,000 మంది మరణించారు. అంటే ప్రపంచవ్యాప్తంగా సగటున, కొండచరియలు విరిగిపడడం వల్ల సంవత్సరానికి 4,600 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటు ఇండియాలోనూ ఈ తరహా మరణాల సంఖ్య ఎక్కువే. కేరళలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడం.. 150కి మందికిపైగా మరణించడం దేశాన్ని విషాదంలో ముంచేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కింలలో తరుచుగా కొండచరియలు విరిగిపడుతుంటాయి. ఇటు పశ్చిమ కనుమలలోని కేరళ, కర్ణాటక, తమిళనాడు , మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ తరహా ఘటనలు ఎక్కువే. భారీ వర్షపాతం, చురుకైన టెక్టోనిక్ కదలికల కారణంగా కొండచరియలు విరిగిపడుతుంటాయి. వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి విపత్తులు తరచూ జరుగుతుతుంటాయి. కొండలు లాంటి ప్రకృతి సిద్ధమైన భౌగోళిక స్వరూపాల నుంచి రాళ్లు, మట్టి కిందకు జారిపడడాన్ని కొండచరియలు విరిగిపడటం అంటారు. ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో ఇలా జరుగుతుంది.

Also Read: అమిత్‌ షా వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన పినరయ్‌ విజయన్‌

కొండ ప్రాంతాలలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, నీటి ప్రవాహాన్ని కంట్రోల్‌ చేసే సిస్టమ్‌లు లేకపోవడం వల్ల నేల కోతకు గురవుతుంది. ఆ సమయంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరుగుతుంది. వివిధ రకాల వాహనాలు, రైళ్లు, హెలికాప్టర్‌లు, విమానం, జలవిద్యుత్ ద్వారా ఉత్పన్నమయ్యే ధ్వని ప్రకంపనలు కొండచరియలు విరిగిపడటానికి మరొక కారణం. ఈ మోటారు యంత్రాలు కదులుతున్నప్పుడు అన్ని దిశలకు స్థిరమైన ధ్వని కంపనాలను ఉత్పత్తి చేస్తాయి. రోడ్ల కింద, పైన పగుళ్లను సృష్టిస్తాయి. వర్షాకాలం వచ్చినప్పుడు ఆ పగుళ్లలోకి నీరు చేరితే కొండచరియలు విరిగిపడతాయి.

ఇక భూమి క్రస్ట్ తీవ్రంగా వేడెక్కినప్పుడు వర్షం కురిస్తే కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నిజానికి కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రోడ్లు, ఆనకట్టలు లాంటి నిర్మాణాలు, ఇతర అభివృద్ధి కార్యకలాపాలపై పరిమితి విధించాల్సి ఉంటుంది. ఇక వ్యవసాయాన్ని లోయలు, మితమైన వాలు ప్రాంతాలకు పరిమిత చేయాలి. నీటి ప్రవాహాన్ని తగ్గించడానికి పెద్ద ఎత్తున అడవుల పెంపకాన్ని చేపట్టాలి. భారత జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ లెక్కల ప్రకారం భారత్‌లో కొండచరియలు విరిగిపడటం వల్ల ఏడాదికి 400 మంది చనిపోతున్నారు. 2013 ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 5,700 మంది మరణించారు. ఇక 2019లో వివిధ ప్రాంతాల్లో కొండచరియల కారణంగా 500 మందికి పైగా మృత్యువాతపడ్డారు.

Also read: ఐఏఎస్‌ కోచింగ్ సెంటర్ ఘటన.. స్పందించిన రావుస్ అకాడమీ

Advertisment
Advertisment
తాజా కథనాలు