Paris Olympics: సెమీ ఫైనల్స్‌లోకి లక్ష్యసేన్..మొదటి ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్

ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ లో లక్ష్యసేన్ అద్భుతాలు చేస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్లో తైవాన్ ప్లేయర్ చో చెన్ మీద గెలిచి సెమీ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టాడు. ఈ ఘనత సాధించిన మొదటి భారత షట్లర్‌‌గా లక్ష్య సేన్ రికార్డ్ సృష్టించాడు.

New Update
Paris Olympics: సెమీ ఫైనల్స్‌లోకి లక్ష్యసేన్..మొదటి ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్

Men Singles Badminton: పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో ఇండియాకు పతకం ఖాయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళల సింగిల్స్, పురుషుల డబుల్‌లో తీవ్ర నిరాశ ఎదురైనా...పురుషుల సింగిస్‌లో లక్ష్య సేన్ మాత్రం అందరి ఆశలను సజీవంగా ఉంచుతున్నాడు. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీ ఫైన్సల్స్లోకి దూసుకెళ్ళాడు లక్ష్య సేన్. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో తైవాన్‌కు చెందిన 12 సీడ్‌ ఆటగాడు చో చెన్‌పై 19-21, 21-15, 21-12 తేడాతో గెలిచి సెమీస్‌లోకి దూసుకెళ్ళాడు. ఇందులో కనుక గెలిస్తే పతకం ఖాయం అవుతుంది. మరోవైపు ఇలా సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించిన మొదట భారత బ్యాడ్మింటన్ ప్లేయర్‌ గా కూడా లక్ష్య సేన్ రికార్డ్ సృష్టించాడు.

క్వార్టర్స్‌లో లక్ష్యసేన్, చో చెన్‌ల మధ్య పోటీ హోరా హోరీగా సాగింది. ఇందులో మొదటి సెట్‌ను చివరి నిమిషంలో చేజార్చుకున్న  లక్ష్యసేన్‌.. ఆ తర్వాత పట్టువిడవకుండా ఆడి 21-15 తేడాతో రెండో సెట్‌ను గెలిచాడు. ఇక చివరి సెట్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి ప్రత్యర్థిని 12 పాయింట్లకే పరిమితం చేశాడు.

Also Read : మరొక్క అడుగు.. 25 మీటర్ల పోటీలో ఫైనల్‌కు చేరిన మనుబాకర్!

Advertisment
తాజా కథనాలు