Lakshadweep: లక్షద్వీప్‌కు ప్రధాని రాకతో.. భారీగా పెరిగిన పర్యాటకులు సంఖ్య

లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ పర్యటించిన తర్వాత.. ఈ ప్రాంతానికి వచ్చే టూరిస్టుల సంఖ్య గతంలో కంటే భారీగా పెరిగిందని అక్కడి పర్యావరణ అధికారులు తెలిపారు. విదేశీ పర్యాటకులు సైతం ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.

New Update
Lakshadweep: లక్షద్వీప్‌కు ప్రధాని రాకతో.. భారీగా పెరిగిన పర్యాటకులు సంఖ్య

PM Modi Impact on Lakshadweep Tourism: ఇటీవల భారత ప్రధాని మోదీ.. లక్షద్వీప్‌ను పర్యటించిన అనంతరం.. భారత్ - మాల్దీవుల మధ్య దౌత్యపర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ అంశంలో భారత నెటిజన్లు కూడా మాల్దీవుల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా లక్షద్వీప్‌కు చెందిన పర్యాటక శాఖ అధికారులు కీలక విషయాలను వెల్లడించారు. ప్రధాని మోదీ.. పర్యటించిన తర్వాత లక్షద్వీప్‌ను (Lakshadweep) సందర్శించే పర్యాటకుల సంఖ్య.. గతంలో కంటే భారీగా పెరిగినట్లు తెలిపారు. చాలామంది భారతీయులు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.

Also Read: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి.. ఈ ఏడాది పదో ఘటన

లక్షద్వీప్‌ పర్యాటక శాఖ అధికారి ఇంతియాస్ మహ్మద్ (Imthias Mohammed) మాట్లాడుతూ.. ' ప్రధాని మోదీ (PM Modi) భారత్‌లో ప్రభావవంతమైన నాయకుడు. ఆయన 2023లో లక్షద్వీప్‌కు వచ్చారు. ఆయన పర్యటన వల్ల ఈ ప్రాంతాన్ని సందర్శించే వారి సంఖ్య పెరిగింది. విదేశీ పర్యాటకులు కూడా ఈ ద్వీపాన్ని సందర్శించేందుకు ప్యాకేజీల కోసం మమ్మల్మి సంప్రదిస్తున్నారు. ఇక్కడి ప్యాకేజీల గురించి మరింతగా తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఆన్‌లైన్‌లో లక్షద్వీప్‌ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారని' పేర్కొన్నారు.

Lakshadweep

అలాగే లక్షద్వీప్‌లో వివిధ పర్యాట కార్యక్రమాలను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ఇంతియాస్‌ మహ్మద్ తెలిపారు. స్కూబా డైవింగ్, వాటర్ స్పోర్ట్స్‌ అనేవి లక్షద్వీప్‌ పర్యాటకంలో ఎక్కువగా ఆదాయాన్ని అందించే విభాగాలని వెల్లడించారు. భవిష్యత్తులో లక్షద్వీప్.. మరిన్ని క్రూయిజ్‌ షిప్ కంపెనీలకు ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఎయిర్ కనెక్టివిటీని క్రమబద్ధీకరించడం వల్ల.. పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.

Also Read: భారత్‌లో లోక్‌సభ ఎన్నికలను చైనా ప్రభావితం చేసే ప్రమాదం : మైక్రోసాఫ్ట్‌

Advertisment
తాజా కథనాలు