ఏ సంబంధంలోనైనా సరే పరస్పర చర్చ, విమర్శ అనేది చాలా ముఖ్యం. బలమైన వివాహానికి కమ్యూనికేషన్ పునాది వంటిది. భార్యాభర్తలు తమ భావాలను ఒకరికొకరు సరిగ్గా వ్యక్తం చేయనంత వరకు సంబంధం బలంగా ఉండదు. ఓపెన్ కమ్యూనికేషన్ అనేది ఏదైనా సంబంధంలో ముఖ్యమైన భాగం. అటువంటి పరిస్థితిలో, మీ భర్త మీ మాట విననప్పుడు, మీ హృదయంలో, మనస్సులో జరుగుతున్న అలజడి గురించి పట్టించుకోనప్పుడు చాలా బాధగా ఉంటుంది. అలాంటప్పుడు మీ భర్త మీ మాట వినాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. దెబ్బకు మీ కొంగు పట్టుకుతిరుగుతాడు.
మాట్లాడటానికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించండి:
మీరిద్దరూ నిశ్శబ్దంగా, ఎలాంటి పరధ్యానం లేకుండా మాట్లాడుకునే సమయాన్ని, స్థలాన్ని ఎంచుకోండి. మీ భర్త ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పుడు మీ భర్తతో మీ సున్నితమైన భావాలను పంచుకోవడం మానుకోండి. ఎందుకంటే వారు పని ఒత్తిడిలో ఉంటారు కాబట్టి ఆ కోపం మీపై చూపే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో మీ సమస్య గురించి చర్చించండి.
జాగ్రత్తగా గమనించండి:
భార్య చెబుతుంటే భర్త శ్రద్ధగా వినాలనే షరతు ఇద్దరికీ వర్తిస్తుంది. సాధారణంగా మీ భర్తతో మాట్లాడేటప్పుడు తను చెప్పేది జాగ్రత్తగా వినండి. అతని కళ్లలోకి చూసి మాట్లాడండి. ఇలా చేస్తే మీ భర్త మీ మాట ఖచ్చితంగా వింటాడు.
మోసం:
మీ భర్తతో మీరు నిజాయితీగా ఉండండి. మీరు కూడా అతని నుంచి అదే ఆశించవచ్చు. మీ భర్త అంతకు మించి మోసం చేస్తే మీరే క్షమించండి.
ఏం చెప్పాలనుకున్నారో స్పష్టంగా చెప్పండి:
మీరు అనుకున్న విషయాలను మీ భర్తకు స్పష్టంగా చెప్పండి. సుదీర్ఘ చర్చలు గందరగోళంతో ముగుస్తాయి. కొన్నిసార్లు విబేధాలు ఉంటే వాటిని పక్కన పెట్టండి. మీ భర్త మిమ్మల్ని దగ్గరికి తీసుకున్నప్పుడు ఒకరికొకరు సహజంగా సరిపోలుతున్నామని మరికొన్ని మాటలు చెప్పి అతన్ని ప్రశంసించండి.
రిజల్యూషన్:
మీరు ఖాళీ సమయంలో మీ భర్తతో ఏం మాట్లాడతారు. దాన్ని స్పష్టంగా ఎలా చెప్పాలో ఆలోచించి చెప్పండి. మాట్లాడటం ప్రారంభించిన తర్వాత మీరు అనవసరమైన పదాలను వాడకూడదు.
ఇది కూడా చదవండి: కేవలం రూ.999కే ఐఫోన్ 13.. వెంటనే ఇలా కొనేయండి..!!