RBI : వినియోగదారులకు బ్యాంకులు షాక్‌.. KYC ప్రక్రియ ఇక మరింత కఠినతరం!

కేవైసీ(KYC) ప్రక్రియను పటిష్టం చేసేందుకు బ్యాంకులు సిద్ధమైనట్టు సమాచారం. ఇకపై KYC కోసం మరిన్ని డాక్యుమెంట్స్‌ అడగవచ్చు. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఆర్థిక అభివృద్ధి మండలి సమావేశంలో ఏకరీతి KYC గురించి చర్చించారు.

New Update
RBI : వినియోగదారులకు బ్యాంకులు షాక్‌.. KYC ప్రక్రియ ఇక మరింత కఠినతరం!

KYC New Rules : పేటీఎమ్‌ పేమెంట్స్ బ్యాంక్‌(Paytm Payments Bank) లో KYCకి సంబంధించిన అవకతవకల తర్వాత బ్యాంకులు రూల్స్‌ మార్చుకునేందుకు ఆలోచిస్తున్నాయి. కఠినమైన వైఖరిని అవలంబించాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు సమాచారం. కేవైసీ(KYC) ప్రక్రియను పటిష్టం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు ఖాతాలు(Bank Accounts) , ఖాతాదారులను గుర్తించిన తర్వాత వారి నుంచి అదనపు పత్రాలు అడగవచ్చు. ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి పాస్‌పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్‌తో సహా ఇతర డాక్యుమెంట్స్‌ను అడ్రెస్‌ ప్రూఫ్‌గా తీసుకుంటున్నారు.

ఏం చేయనున్నారు?
ఉమ్మడి ఖాతాల కోసం పాన్, ఆధార్, మొబైల్ నంబర్ తాజా ధృవీకరణ ఉంటుంది. బ్యాంకులు అలాంటి ఖాతాదారుల నుంచి KYC కోసం మరిన్ని పత్రాలను అడగవచ్చు. ఇక ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ అధ్యక్షతన ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మొత్తం ఆర్థిక రంగంలో KYC నియమాలను నిర్ధారిస్తుంది. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఆర్థిక అభివృద్ధి మండలి సమావేశంలో ఏకరీతి KYC గురించి చర్చించారు.

మరోవైపు Paytm పేమెంట్ బ్యాంక్‌లో డిపాజిట్లు, ఇతర లావాదేవీల గడువును RBI మార్చి 15 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. జనవరి 31న జారీ చేసిన సర్క్యులర్‌లో, ఫిబ్రవరి 29 తర్వాత, పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేయలేమని ఆర్‌బీఐ చెప్పింది. ఈ బ్యాంక్ ద్వారా వాలెట్, ప్రీపెయిడ్ సేవలు, ఫాస్టాగ్, ఇతర సర్వీసులలో డబ్బు జమ చేయడం కుదరదు. ఇక గత నెల 26న Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ బోర్డు నుంచి రాజీనామా చేశారు. ఆయన బ్యాంక్ పార్ట్ టైమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. ఆయన రాజీనామా తర్వాత బ్యాంకు కొత్త బోర్డు ఏర్పాటైంది.

Also Read : రైతులకు జగన్‌ అదిరిపోయే గిఫ్ట్‌.. ఇవాళ అన్నదాతల ఖాతాలలో డబ్బులు జమ!

Advertisment
Advertisment
తాజా కథనాలు