Kurchi Thata Mind Blowing Dialogue : 'కుర్చీ మడతపెట్టి' డైలాగ్ ఏదో ఒక యూట్యూబ్ ఛానెల్ లో ఒక ముసలి అన్నారు. ఆ తర్వాత ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈ డైలాగ్ ఒక రేంజ్ లో పాపులరైంది. 'కుర్చీ మడతపెట్టి' అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన మీమ్స్ కూడా వచ్చాయి. ఇక ఈ డైలాగ్ మహేష్ బాబు(Mahesh Babu) 'గుంటూరు కారం'(Guntur Kaaram) వరకు వెళ్ళింది. తాజాగా గుంటూరు కారం సినిమా నుంచి మాస్ బీట్ 'కుర్చీ మడతపెట్టి' అంటూ సాంగ్ రిలీజ్ చేశారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో ఈ డైలాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో .. డైలాగ్ చెప్పిన కుర్చీ తాత కూడా అంతే ఫేమస్ అయ్యారు.
ఇక తాజాగా RTV ఇంటర్వ్యూ లో పాల్గొన్న కుర్చీ తాత.. అసలు గుంటూరు కారం పాటలో ఈ డైలాగ్ ఎలా తీసుకున్నారు.. దీని కోసం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కుర్చీ తాతను ఎలా అప్రోచ్ అయ్యారనే దాని పై ఆసక్తికర విషయాలు తెలిపారు. ఇంటర్వ్యూ లో కుర్చీ తాత మాట్లాడుతూ .. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వైజాగ్ సత్యం ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యారు. అన్నపూర్ణ స్థూడియోలో 'కుర్చీ మడతపెట్టి' నా వాయిస్ తోనే డైలాగ్స్ రికార్డ్ చేశారు. ఈ పాటకు సంబంధించి తనకు లక్ష రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలిపారు. కానీ మరో ఆసక్తికరమైన విషయం తెలిపారు. ఈ పాటలో మహేష్ బాబు తో తన డాన్స్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పారు. అలాగే ఈ పాటలో మహేష్ బాబు డాన్స్ ఇరగదీశారు.. సినిమా కోసం వెయిట్ చేస్తున్నాని చెప్పారు. మహేష్ బాబు సినిమాలో నా పాట ఉండడం చాలా హ్యాపీ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. పూర్తి వీడియో ఇక్కడ చూడండి.