/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Kumari.jpg)
Kumari Aunty Election Campaign In AP : హైదరాబాద్(Hyderabad)లో ఫుడ్ వ్యాపారం(Food Business) చేస్తున్న కుమారీ ఆంటీ(Kumari Aunty) ఇటీవల సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె దగ్గర ఫుడ్ కొనేందుకు జనాలు బారులు తీరేవారు. రోడ్‌పై ట్రాఫిక్ జామ్ అవుతుందనే కారణంతోనే పోలీసులు ఆమెను అక్కడ వ్యాపారం చేసుకోవద్దని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి సీఎం రేవంత్ స్పందించి ఆమె ఫుడ్ బిజినెస్ చేసుకునేందుకు అనుమతిచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల కుమారీ ఆంటీకి ఉన్న క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కుమారీ ఆంటీ పేరు తెలియని వారు ఉండరనే స్థాయికి ఆమె వెళ్లిపోయారు.
Also Read: ఇవే బ్రాండ్లు బాబోయ్.. వైన్ షాప్ దగ్గర పాల్ ప్రచారం: VIDEO
అయితే తాజాగా కుమారీ ఆంటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు(TDP Venigandla Ramu) మద్దతుగా.. కుమారీ ఆంటీ ఎన్నికల ప్రచారం చేశారు. గుడివాడ పట్టణంలోని 32,31,25,21,24 వార్డుల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. అలాగే తనకు ఓటు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకే ఓటు వేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీల నేతలు ప్రచారాల్లో మునిగిపోయారు. అయితే తాజాగా కుమారీ ఆంటీ ఎన్నికల ప్రచారం చేసిన వీడియో వైరల్ అవుతోంది.
గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము గారికి మద్దతుగా గుడివాడ పట్టణంలోని 32,31,25,21,24 వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేసిన కుమారి ఆంటీ.
✍️ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకపోతే కలిగే అనర్ధాలను రాము గారితో కలిసి ప్రజలకు వివరించిన కుమారి ఆంటీ.
కుమారి ఆంటీ కామెంట్స్ :-
✍️… pic.twitter.com/IUBOj5k8SY
— Venigandla Ramu (@RamuVenigandla) May 9, 2024
Also Read: కూటమికి షాక్.. రేపటి అమిత్ షా పర్యటన రద్దు