KTR: కాంగ్రెస్‌కు కౌంటర్.. నేడు కేటీఆర్ 'స్వేద పత్రం' విడుదల

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన శ్వేతపత్రానికి కౌంటర్ గా మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు తెలంగాణ భవన్ లో స్వేద పత్రం విడుదల చేయనున్నారు. వాస్తవానికి నిన్నే విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వాళ్ళ ఈరోజుకి వాయిదా పడింది.

New Update
KTR: కాంగ్రెస్‌కు కౌంటర్.. నేడు కేటీఆర్ 'స్వేద పత్రం' విడుదల

BRS Working President KTR : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఏ ట్రెండ్ నడుస్తుందని అడిగితే అందరు చెప్పే మాట శ్వేతపత్రాలు ట్రెండ్ అని అంటున్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో గత 10 ఏండ్లు బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రగతి రిపోర్టును(శ్వేతపత్రం) అసెంబ్లీలో ప్రస్తావిస్తోంది. ఇటీవల తెలంగాణ(Telangana) రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో పాటు విద్యుత్ రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ శ్వేతపత్రాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు గట్టిగానే జరిగాయి.

ALSO READ: సీఎం రేవంత్ కీలక భేటీ.. ధరణి రద్దు, రైతు బంధు అంశాలపై కసరత్తు

ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇది శ్వేతపత్రం కాదని బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లే పత్రం అని మండిపడ్డారు. తెలంగాణ అప్పుల గురించే కాదు గత 10 ఏళ్లలో పెరిగిన ఆస్తుల విలువలపై కూడా శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తొమ్మిదిన్నరేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరించేందుకు శనివారం తెలంగాణ భవన్ లో ‘స్వేద పత్రం’ విడుదల చేయనున్నట్టు కేటీఆర్ తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల స్వేద పత్రం నిన్న కేటీఆర్ విడుదల చేయలేదు. వాయిదా పడడం వెనుక కారణాలు ఏంటో తెలీదు. ఈ నేపథ్యంలో ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఈ స్వేద పత్రాన్ని విడుదల చేయనున్నారు. కేటీఆర్ విడుదల చేసే స్వేద పత్రంలో ఎలాంటి అంశాలు ఉంటాయనే ఉత్కంఠ అటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు బీజేపీ, కాంగ్రెస్ నేతల్లో నెలకొంది.

ALSO READ: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు