KTR: బర్త్‌ డే సందర్భంగా మంచి మనసు చాటుకున్న కేటీఆర్..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ తన జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఏటా నిర్వహించే గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో స్టేట్ హోంలో ఉన్న 100 మంది విద్యార్థినిలకు లాప్‌టాప్‌లను అందజేశారు.

New Update
KTR: బర్త్‌ డే సందర్భంగా మంచి మనసు చాటుకున్న కేటీఆర్..

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌.. తన జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. నేత కార్మికుల కుటుంబాలు, వారి పిల్లల విద్యా, భవిష్యత్ అవసరాల కోసం ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సమక్షంలో ఆయన తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్టేట్ హోంలో ఉన్న 100 మంది విద్యార్థినిలకు లాప్‌టాప్‌లను అందజేశారు.

Also Read: ఢిల్లీలో జగన్ కు ఊహించని మద్దతు.. ఇండియా కూటమిలోకి వైసీపీ?

2020లో కరోనా సమయంలో కేటీఆర్‌ తన బర్త్ డే వేడుకలను ఇతరులకు సాయం చేసే విధంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే ఏటా గిఫ్ట్‌ ఏ స్మైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తనతో పాటు తన శ్రేయోభిలాషులు, అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇలా ఏటా కేటీఆర్.. తన బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సేవ చేస్తున్నారు. ఇప్పటివరకు 6,000 మంది విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా టాబ్లెట్ పరికరాలను అందజేసినట్లు కేటీఆర్‌ తెలిపారు. 1400 మంది దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్లను అందించినట్లు పేర్కొన్నారు. గత ఏడాదే తన జన్మదినం సందర్భంగానే స్టేట్ హోమ్ విద్యార్థులకు లాప్‌టాప్‌లు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని.. కానీ ఎన్నికల వల్ల అది సాధ్యం కాలేదన్నారు. గతేడాది ఇచ్చిన హామీ ఈ ఏడాది నెరవేరిందన్నారు.

publive-image

ఏటా తాను చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో సంతృప్తినిస్తోందని.. కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. పెద్దలు చెప్పిన్నట్లు పుట్టుక మరణం మాత్రమే నిజమని మధ్యలో మిగిలినదంతా నిజమో? అబద్దమో? తెలియని పరిస్థితి ఉంటుందని అన్నారు. అందుకే జీవితంలో మనసుకి సంతృప్తినిచ్చే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే తనకు ఎక్కువ సంతోషం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు ఆయన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు రియాన్షి పాల్గొన్నారు.

Also Read:  తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా..

Advertisment
Advertisment
తాజా కథనాలు