బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ: ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ డిపాజిట్ గల్లంతు ఖాయం అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే నిజామాబాద్ ప్రజలు డిసైడ్ అయ్యారని.. మీరు ఎక్కడ పోటీ చేసినా నీ డిపాజిట్ గల్లంతు చేయడం ఖాయమని కేటీఆర్ తేల్చిచెప్పారు. గత యాభై ఏండ్లలో తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కూడా మోసం చేసేందుకు యత్నిస్తోందని మంత్రి నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి నికార్సయిన తెలంగాణవాది కాదు.. తెలంగాణకు పట్టిన పెద్ద వ్యాధి.. ఉద్యమకారులపైకి రైఫిల్ తీసుకెళ్లిన రైఫిల్ రెడ్డంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..3 గంటల కాంగ్రెస్ కావాలా..? 3 పంటల కేసీఆర్ కావాలా..?: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్: బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలో రూ.50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌తో పాటు మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను, అధునాతన వైకుంఠధామాన్ని, రఘునాథ చెరువు ట్యాంక్‌బండ్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి కేటీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు.
Translate this News: