3 గంటల కాంగ్రెస్ కావాలా..? 3 పంటల కేసీఆర్ కావాలా..?: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు నిజామాబాద్: బీఆర్‌ఎస్ మంత్రి కేటీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలో రూ.50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌తో పాటు మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను, అధునాతన వైకుంఠధామాన్ని, రఘునాథ చెరువు ట్యాంక్‌బండ్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి కేటీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు. By Vijaya Nimma 09 Aug 2023 in తెలంగాణ నిజామాబాద్ New Update షేర్ చేయండి బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ: ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ డిపాజిట్ గల్లంతు ఖాయం అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే నిజామాబాద్ ప్రజలు డిసైడ్ అయ్యారని.. మీరు ఎక్కడ పోటీ చేసినా నీ డిపాజిట్ గల్లంతు చేయడం ఖాయమని కేటీఆర్ తేల్చిచెప్పారు. గత యాభై ఏండ్లలో తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కూడా మోసం చేసేందుకు యత్నిస్తోందని మంత్రి నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి నికార్సయిన తెలంగాణవాది కాదు.. తెలంగాణకు పట్టిన పెద్ద వ్యాధి.. ఉద్యమకారులపైకి రైఫిల్ తీసుకెళ్లిన రైఫిల్ రెడ్డంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పట్టిన వ్యాధి: నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కాంగ్రెసోళ్లు కూడా కేసీఆర్ మీద ఎగబడి ఎగబడి మాట్లాడుతున్నారని కేటీఆర్ కామెంట్స్ చేశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండని కాంగ్రెస్ ఏనేతలు అడుగుతున్నారు.. మీకు ఒక్కసారి కాదు.. పది సార్లు అవకాశం ఇవ్వలేదా.? 50 ఏళ్ల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ మనల్ని సతాయించలేదా..? 50 ఏండ్ల పాటు అధికారంలో ఉండి తాగు, సాగునీరు, కరెంట్ చక్కగా ఇవ్వలేదన్న విషయం గుర్తు చేశారు. ఎరువులు, విత్తనాలు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టారని.. ఇవాళ వాళ్లే వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.. ప్రజలు ఒక్కసారి ఆలోచించండి అంటూ కేటీఆర్ ప్రజలకి విజ్ఞప్తి చేశారు. యాభై ఏండ్లు పరిపాలించినోళ్లు, ఏ పని చేయడానికి చేతకానోళ్లు.. నేడు మన ముందుకొచ్చి కేసీఆర్‌ను తిడుతుంటే పడుదామా? తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపైకి రైఫిల్ తీసుకెళ్లిన రైఫిల్‌రెడ్డి.. నికార్సయిన తెలంగాణ వాది అటా..? రేవంత్‌రెడ్డి నీవు తెలంగాణవాది కాదు.. నువ్వు తెలంగాణకు పట్టిన వ్యాధి. తెలంగాణకు పట్టిన జబ్బు, దరిద్రం కాంగ్రెస్ పార్టీ. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ మాటలను నమ్మి ఆగం కావొద్దని ప్రజలకు సూచించారు మంత్రి కేటీఆర్. ఎవరు కావాలో మీరే చెప్పండి: నిరుద్యోగ యువతకు ఓ వైపు శిక్షణ.. మరో వైపు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న నేతలే కలకాలం గుర్తుండిపోతారని అన్నారు. ప్రజల కోసం పనిచేసే వారినే వచ్చే ఎన్నికల్లో గెలిపించండని.. గతంలో పెద్ద పెద్ద నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచినా ప్రజలను పట్టించుకోలేదన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ ఆగమైంది.. నక్సలిజం వల్ల వెనుకబడిందని కేటీఆర్ అన్నారు. వరి సాగు నేడు తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంది. కేసీఆర్ విధానాల వల్లే నేడు నిండా చెరువులు పచ్చని పంటలు కనిపిస్తున్నాయి. ఎంపీ అరవింద్‌వి చిల్లర మాటలని.. 70 ఏళ్ల వయసులో కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ధరలు పెంచిన బీజేపీ నేతలను నిలదీయండని ప్రజలుకు కేటీఆర్ సూచించారు. 3 గంటల కాంగ్రెస్ కావాలా..? 3 పంటల కేసీఆర్ కావాలా..? మతం మంటలు పెడుతున్న బీజేపీ కావాలా..? అంటూ ప్రజల్ని కోరారు కేటీఆర్. తెలంగాణ కాంగ్రెస్ వస్తే మొత్తం కుంభకోణాలే జరుగుతాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. #congress #nizamabad #brs-public-meeting #fire-on-minister-ktr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి