Krithi Shetty: 100 కోట్ల సినిమాలో బేబమ్మ..బంపరాఫర్ కొట్టేసిందిగా!

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతిశెట్టి..తాజాగా 100 కోట్ల సినిమాలో నటిస్తుంది. ఈ మేరకు చిత్ర బృందం నుంచి ప్రకటన విడుదలైంది.

Krithi Shetty: 100 కోట్ల సినిమాలో బేబమ్మ..బంపరాఫర్ కొట్టేసిందిగా!
New Update

Krithi Shetty : ఉప్పెన (Uppena) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ కృతి శెట్టి (Krithi Shetty). తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఉప్పెన తరువాత నాని సినిమా శ్యామ్‌ సింగరాయ్‌ తో మరో హిట్‌ అందుకుంది. ఆ తరువాత నాగ చైతన్యతో బంగార్రాజు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.మంచి విజయాన్ని కూడా అందుకుంది.

బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో అలరించిన బేబమ్మ..ఆ తరువాత సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వరుసగా ఫ్లాప్స్‌ బేబమ్మను పలకరించాయి. యంగ్‌ హీరోలందరి సరసన నటించింది కృతిశెట్టి. కానీ సినిమాలన్ని కూడా కృతికి నిరాశనే మిగిల్చాయి. చివరిగా చేసిన సినిమా కస్టడీ కూడా పెద్ద డిజాస్టర్‌ గా నిలిచింది.

ఆ మధ్య తమిళ నటుడు సూర్యతో ఓ సినిమా అనౌన్స్‌ చేసినప్పటికీ అది ఎందుకో పట్టాలెక్కలేదు. కానీ ఇప్పుడు ఓ బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది బేబమ్మ.....తమిళ్‌ లో జీనీ అనే సినిమా రానుంది. ఈ చిత్రంలో జయం రవి హీరోగా నటిస్తున్నాడు. కృతి తో పాటు కల్యాణి ప్రియదర్శన్‌, వామిక కబీ కూడా ఇందులో నటిస్తున్నారు.

దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌ తో వేల్ష్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకం పై ఐసరీ గణేష్‌ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిట్‌ అయితే కృతి దశ తిరిగినట్లే. మళ్లీ ట్రాక్ లోకి వస్తుంది.. చూడాలి మరి ఎలా ప్రేక్షకులను అలరిస్తుందో!

Also read: కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలి: సీఎం జగన్‌!

#uppena-movie #krithi-shetty #cinema #new-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe