Krithi Shetty: మెగా హీరోతో బేబమ్మ పెళ్లి..సోషల్ మీడియాలో వైరల్..!!

కన్నడ భామ కృతి శెట్టి సంబంధించి నెట్టింట్లో ఓ వార్త వైరల్ అవుతోంది. త్వరలోనే ఆమె తెలుగింటి కోడలు కాబోతోందని సోషల్ మీడియాలో నెటిజన్స్ హల్‌చల్ చేస్తున్నారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్‌ వినపడుతోంది. 'ఉప్పెన' చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు. ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కృతి శెట్టి. ఈ కన్నడ యంగ్ బ్యూటీకి ఉప్పెన ఎనలేని గుర్తింపు తెచ్చింది.

New Update
Krithi Shetty: మెగా హీరోతో బేబమ్మ పెళ్లి..సోషల్ మీడియాలో వైరల్..!!

 Krithi Shetty and Vaishnav Tej Marriage Rumour: కన్నడ భామ కృతి శెట్టి(Krithi shetty) సంబంధించి నెట్టింట్లో ఓ వార్త వైరల్ అవుతోంది. త్వరలోనే ఆమె తెలుగింటి కోడలు కాబోతోందని సోషల్ మీడియాలో నెటిజన్స్ హల్‌చల్ చేస్తున్నారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), కృతి ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్‌ వినపడుతోంది. 'ఉప్పెన' చిత్రంలో (Uppena Movie) వీరిద్దరూ జంటగా నటించారు. ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కృతి శెట్టి. ఈ కన్నడ యంగ్ బ్యూటీకి ఉప్పెన ఎనలేని గుర్తింపు తెచ్చింది. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిచిందని చెపుతున్నారు. అయితే ఈ పెళ్లి వార్తలపై కృతి, వైష్ణవ్ ఏ మాత్రం రియాక్ట్ అవ్వలేదు. దీంతో, ఈ వార్త ఎంత వరకు నిజమో తేలాలంటే వేచి చూడాల్సిందే.

publive-image

'ఉప్పెన' మూవీతో కృతి శెట్టి యూత్ లో మంచి క్రేజ్ రాబట్టింది. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఉప్పెనలో కృతి కాలేజ్ గర్ల్ గా తన గ్లామర్ తో కట్టిపడేసింది. అలాగే క్లైమాక్స్ లో అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో మెప్పించింది. దర్శకుడు బుచ్చిబాబు (Buchi babu) తెరకెక్కించిన ఉప్పెన చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించింది. వంద కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. అత్యధిక లాభాలు తెచ్చిన చిత్రాల జాబితాలో చేరింది.

publive-image

ఆ వెంటనే మరో రెండు హిట్స్ ఆమె ఖాతాలో పడ్డాయి. నానికి జంటగా నటించిన శ్యామ్ సింగరాయ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక 2022 సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు మూవీలో నాగ చైతన్యకు జంటగా నటించింది. అలా హ్యాట్రిక్ పూర్తి చేసి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అయితే ఆ జోరు కొనసాగించడంలో కృతి శెట్టి ఫెయిల్ అయ్యింది.

publive-image

స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడింది. కృతి శెట్టికి వరుసగా నాలుగు ప్లాప్స్ పడ్డాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఒక్కసారిగా కృతి శెట్టి కెరీర్ తిరగబడింది. లక్కీ హీరోయిన్ ట్యాగ్ కి దూరమైంది. ప్రస్తుతం తెలుగులో ఆమెకు ఆఫర్స్ తగ్గాయి.

publive-image

కెరీర్ నెమ్మదించిన క్రమంలో గ్లామర్ షో చేస్తుంది. చీరలో సోయగాలు పరిచయం చేసింది. బేబమ్మ గ్లామర్ షో హాట్ టాపిక్ అవుతుంది. కృతి శెట్టి శారీలో అద్భుతంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆఫర్స్ కోసమే కృతి శెట్టి గ్లామర్ షో చేస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.

publive-image

జాతీయ అవార్డు గెలుచుకున్న 'ఉప్పెన' చిత్రంతో తెరంగేట్రం చేసిన పంజా వైష్ణవ్ తేజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన 'ఆదికేశవ' అనే యాక్షన్ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

Also Read: బేబీ సినిమాపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆనంద్ తీవ్ర ఆగ్రహం

Advertisment
తాజా కథనాలు