Krishna Mukunda Murari : ముకుందకు షాకిచ్చిన కృష్ణ - మురారి.. కోడలి నిజస్వరూపం తెలుసుకున్న భవానీ దేవి

కృష్ణ , మురారి.. వాలెంటైన్స్ డే కాంపిటీషన్ ఇంట్లోనే నిర్వహిస్తామని చెప్పగానే ముకుంద షాకవుతుంది. మరో వైపు కోడలి నిజస్వరూపం గురించి తెలుసుకున్న భవానీ దేవి.. నిజం బయట పడిన రోజు ముకుందని క్షమించేదే లేదని అనుకుంటుంది. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Krishna Mukunda Murari : ముకుందకు షాకిచ్చిన కృష్ణ - మురారి.. కోడలి నిజస్వరూపం తెలుసుకున్న భవానీ దేవి

Krishna Mukunda Murari : ఆదర్శ్ ముకుంద(Mukunda) గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మధు(Madhu).. ఏంటీ ఆదర్శ్ ఒంటరిగా ఆలోచిస్తూ ఉన్నావు అని అడుగుతాడు. దాంతో ఆదర్శ్ ఆలోచించడానికి ఏం లేదు అని సమాధానం ఇస్తాడు. పాపం ఎక్కడో ప్రశాంతంగా ఉన్న ఆదర్శ్ ను వెతికి మరీ తీసుకొచ్చింది కృష్ణ.. కానీ ముకుంద మాత్రం మారేలా లేదు అని మనసులో అనుకుంటాడు మధు.

Adarsh - Madhu

ఇటు మురారికి వాలెంటైన్స్ డే కాంపిటీషన్(Valentines Day Competition)  క్యాన్సిల్ అయ్యిందని తన ఫ్రెండ్ గోపి ఫోన్ చేసి చెప్తాడు. ఇది తెలియగానే మురారి ప్లాన్ అంతా పాడైందని చిరాకుగా ఉంటాడు. మురారిని చూసిన కృష్ణ.. ఏంటీ సర్ అలా ఉన్నారు అని అడుగుతుంది. వాలెంటైన్స్ డే కాంపిటీషన్ క్యాన్సిల్ అయ్యిందని చెప్తాడు.

Valentines Day Competition | Murari - Krishna
ఇది వినగానే కృష్ణ(Krishna) నవ్వడం స్టార్ట్ చేస్తుంది. దీంతో మురారి(Murari) కాంపిటీషన్ క్యాన్సిల్ అయ్యిందని నేను.. టెన్షన్ పడుతుంటే నువ్వు నవ్వుతున్నావేంటి.. నిజంగా నీకు పిచ్చి పట్టింది అని సీరియస్ అవుతాడు . ఇక కృష్ణ.. ఇలా జరగడం మన మంచికే.. వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆదర్శ్, ముకుంద బెస్ట్ కపుల్ గా గెలుస్తారని గ్యారెంటీ లేదు. అందుకని మనమే కండక్ట్ చేశామనుకో ఆదర్శ్, ముకుందను గెలిపించడం ఈజీ. ఇక పెద్ద అత్తయ్యకు ముకుంద పై ఉన్న అనుమానం కూడా తొలగిపోతుందని సూపర్ ఐడియా ఇస్తుంది.

Murari - Krishna

మరో వైపు కాంపిటీషన్ క్యాన్సిల్ చేయమని చెప్పిన ముకుంద.. పెద్ద అత్తయ్యకు ఏ మాత్రం డౌట్ రాకుండా మాట్లాడమని ఆదర్శ్ తో చెప్తుంది. ఏం మాట్లాడాలో సరిగ్గా ఆలోచించుకోమని భర్తకు జాగ్రత్తలు చెప్తుంది. ఇక ఆదర్శ్ ఎవ్వరికీ డౌట్ రాకుండా మేనేజ్ చేస్తానని ముకుందకు దైర్యం చెప్తాడు.

Adarsh - Mukunda
ఇంట్లో అందరు హల్లో కూర్చొని ఉంటారు. కాంపిటీషన్ విషయం గురించి చెప్పాలని ఆదర్శ్(Adarsh), ముకుంద అక్కడికి వస్తారు. కానీ ఇంతలో భవానీ దేవి.. ఆదర్శ్ ను నెక్స్ట్ ఏం చేద్దావని అనుకుంటున్నావని అడుగుతుంది. ఇంకా ఏం ఆలోచించలేదని చెప్తాడు ఆదర్శ్. దానికి భవాని సమయం వచ్చినప్పుడు చెప్తాను చేయడనికి సిద్ధంగా ఉండమని అంటుంది. భవాని ఇలా చెప్పగానే.. ముకుందలో టెన్షన్ మొదలవుతుంది. నా గురించి పూర్తిగా తెలిసిపోయిందా..? నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తుందా..? అని మనసులో అనుకుంటుంది.

Mukunda
ఇంతలో అక్కడికి వచ్చిన కృష్ణ, మురారి కాంపీటీషన్ క్యాన్సిల్ అయ్యిందని చెప్తారు. ఇది వినగానే ముకుంద మొహం వెలిగిపోతుంది. ముకుంద సంతోషం కాసేపు కూడా లేకుండా మరో షాక్ ఇస్తాడు మురారి. అక్కడ క్యాన్సిల్ అయ్యింది కానీ.. అదే కాన్సెప్ట్ తో మన ఇంట్లోనే మనమే ఈ వాలెంటైన్స్ డే కాంపీటీషన్ నిర్వహిస్తామని మురారి చెప్పగానే ముకుంద ఫ్యూజులు ఎగిరిపోతాయి.

Krishna Mukunda Murari Family
ముకుందను గమనిస్తున్న భవానీ దేవి అనుమానం ఇంకా పెరిగిపోతుంది. ముకుందకు ఇష్టం లేకపోయిన ఆదర్శ్ తో ప్రేమగా ఉన్నట్లు నటిస్తుంది. ఈ విషయం ఎవ్వరికీ అర్థం కావడం లేదు . ముకుంద నిజంగానే మారితే సంతోషం.. కానీ మారినట్లు నటిస్తే మాత్రం.. నా ఇద్దరి కొడుకుల జీవితాలు నాశనం అవుతాయని మనసులో టెన్షన్ పడుతుంది భవాని దేవి. నిజం బయట పడిన రోజు ముకుందని క్షమించేదే లేదని అనుకుంటుంది.

Bhavani Devi
కృష్ణ ఆదర్శ్ ను ట్రీట్ ఇవ్వమని అడగడంతో.. ముకుంద-ఆదర్శ్, మురారి- కృష్ణ బయటకు వెళ్ళడానికి రెడీ అవుతుంటారు. ఆదర్శ్ రెడీ అయ్యి రాగానే ఏంటీ ఇలాగే వస్తావా.. షర్ట్ బాగాలేదు అని చెప్తుంది. నువ్వు అందరి ముందు బాగా కనిపించాలని నా ఆశ అన్నట్లుగా.. ఆదర్శ్ పై లేని ప్రేమను నటిస్తుంది ముకుంద. ఇది నిజమని నమ్ముతున్న ఆదర్శ్ సంతోషంగా ఫీల్ అవుతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Mukunda - Adarsh - Krishna

Also Read: Sitara Dance Video: నాన్న పాటకు స్టెప్పులేసిన మహేశ్ ముద్దుల కూతురు.. ధమ్ మసాలా వీడియో వైరల్!

Advertisment
తాజా కథనాలు