Krishna Mukunda Murari: మురారికి అడ్డంగా దొరికిపోయిన ముకుంద.. కృష్ణకు హానీ చేయాలని కన్నింగ్ ప్లాన్

మురారి కృష్ణల శోభనం ఆపేయాలని చీప్ ట్రిక్ ప్లే చేస్తుంది ముకుంద. నిజం తెలుసుకున్న మురారి.. ముకుందకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. మరో వైపు ముకుంద ప్రేమ నిజమని నమ్ముతున్న ఆదర్శ్ ఆనందంతో తేలిపోతుంటాడు. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Krishna Mukunda Murari: మురారికి అడ్డంగా దొరికిపోయిన ముకుంద.. కృష్ణకు హానీ చేయాలని కన్నింగ్ ప్లాన్

Krishna Mukunda Murari Today Episode : శోభనం క్యాన్సిల్(First Night Cancel) చేయాలనీ ఆదర్శ్(Adarsh) దగ్గరికి వెళ్లిన మురారి(Murari).. ఆదర్శ్ ఆనందాన్ని చూసి ఏం మాట్లాడలేక తిరిగి వచ్చేస్తాడు. దీంతో కృష్ణ.. శోభనం ఎలా క్యాన్సిల్ చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది.

Adarsh - Murari

మరో వైపు కృష్ణ మురారిల శోభనం ఆపేయడానికి ప్లాన్ వేస్తుంది ముకుంద(Mukunda). దాని కోసం ఒక పౌడర్ ను తెప్పిస్తుంది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా.. వెళ్లి ఆ పౌడర్ ను తీసుకుంటుంది.

Mukunda
పౌడర్ తీసుకొని కంగారు ఇంట్లోకి వస్తుంటుంది ముకుంద.. ఈ క్రమంలో అటు నుంచి వస్తున్న కృష్ణ(Krishna) కు డ్యాష్ ఇస్తుంది. దీంతో ముకుంద చేతిలో ఉన్న పౌడర్ కింద పడుతుంది. ఇక పౌడర్ కింద పడగానే కృష్ణ ఎక్కడ చూస్తుందోనని తెగ టెన్షన్ పడుతుంది ముకుంద. ఇంతలో అక్కడి వచ్చిన రేవతి కింద పడిన పార్సిల్ తీసుకొని ఏంటిది అని అడుగుతుంది. నెయిల్ పాలిష్ ప్యాక్ అని కవర్ చేసి.. దాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది ముకుంద.

Madhu Shocked
పార్సిల్ తీసుకొని రూమ్ లోకి వచ్చిన ముకుంద ఎలాగైనా.. ఈ పౌడర్ ను కృష్ణ, మురారి గదిలో పెట్టాలి.. ఇది రాసుకోగానే కృష్ణ మొహం పై దద్దుర్లు వస్తాయి. దీంతో వాళ్ళ శోభనం ఆగిపోతుంది అని మనసులో అనుకుంటుంది ముకుంద. మురారి కృష్ణ గదిలోకి వెళ్లాలని బయటకు వస్తుంది ముకుంద.. అక్కడే మాట్లాడుకుంటూ ఉన్న మధు, మురారిని చూసి షాకవుతుంది.

Mukunda
మధు, మురారిని తప్పించుకొని కృష్ణ గదిలోకి వెళ్లి అక్కడ తాను తెప్పించిన పౌడర్ ను పెట్టేస్తుంది. హమ్మయ్యా పౌడర్ పెట్టేశాను.. ఇక కృష్ణ, మురారిలా శోభనం క్యాన్సిల్ అవ్వడం ఖాయం.. వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది ముకుంద. కానీ తిరిగి వెనక్కి చూసేలోపు అక్కడ మురారి ఉంటాడు. దీంతో ముకుందకు దిమ్మతిరుగుతుంది.

Murari
ముకుంద కుట్ర గురించి తెలుసుకున్న మురారి.. ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎన్ని ప్లాన్ చేసిన మా శోభనాన్ని ఆపలేవు. ఈరోజు నుంచి కృష్ణ , నేను నిజమైన భార్య భర్తలం కాబోతున్నాము అని ముకుందకు క్లాస్ ఇస్తాడు మురారి.దీంతో తట్టుకోలేకపోయిన ముకుంద.. ఈ శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తాను అంటూ మురారిని హెచ్చరిస్తుంది.

Mukunda - Murari

ఆదర్శ్ తో శోభనం ఇష్టంలేని ముకుంద రెడీ అవ్వకుండా అలాగే ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రేవతి ఇంకా రెడీ అవ్వలేదా..? అని ముకుందను తొందర పెడుతుంది. ఆదర్శ్ తో శోభనం ఆపేయాలని డిసైడ్ అయిన ముకుంద.. సారీ అత్తయ్య ఈ శోభనం జరగదు అని మనసులో రేవతికి క్షమాపణలు చెప్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Revathi

Also Read : Balakrishna: గాలికి విగ్‌ ఊడింది.. కోపంతో ఊగిపోయిన బాలయ్య ఏం చేశాడంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు