/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-38-jpg.webp)
Krishna Mukunda Murari Serial: గుడికి వెళ్లిన కృష్ణ మురారి, ముకుంద ఆదర్శ్ జంటలతో ప్రత్యేక పూజలు చేయిస్తారు పంతులు గారు. దీంట్లో భాగంగా.. భార్య భర్తలు ఒకరిని ఒకరు పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయమని చెప్తారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-35-jpg.webp)
ఇది వినగానే ముకుంద షాకవుతుంది. ఆదర్శ్ పక్కన ఉంటేనే చిరాకుగా ఉంటుంది.. అలాంటిది తనను తాకడం అంటే నా వల్ల కాదు అని మనసులో అనుకుంటుంది. కృష్ణ మాత్రం ఇలాగైనా ఆదర్శ్ పై ముకుందకు ప్రేమ కలుగుతుంది అని సంతోషిస్తుంది.
Also Read : Ram Charan-NTR: హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో రామ్ – భీమ్.. ఇద్దర్నీ ఒకే చోట చూసి ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా..?
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-34-jpg.webp)
భర్త ఆదర్శ్ పై ఏ మాత్రం ప్రేమలేని ముకుంద.. అతన్ని పట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏవేవో సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ముకుంద నిజస్వరూపం తెలిసిన మురారి, కృష్ణ ఆమె నాటకాలకు చెక్ పెడతారు. ఆదర్శ్ ను పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేలా చేస్తారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-32-jpg.webp)
ఆదర్శ్ అలా హగ్ చేసుకొని నడవడం చిరాకుగా ఫీల్ అవుతున్న ముకుంద.. ఎలాగైనా తప్పించుకోవాలని ప్లాన్ వేస్తుంది. గుడి చుట్టూ తిరిగే క్రమంలో తన చేతి గాజులు పగలగొట్టి దారిలో వేస్తుంది. దీంతో చూసుకోకుండా వాటిని తోక్కేసిన ఆదర్శ్ గాయపడతాడు. ముకుంద అనుకున్నట్లుగానే ఆదర్శ్ కాలికి దెబ్బ తగలడంతో ప్రదక్షిణాలు ఆగిపోతాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-33-jpg.webp)
మరో వైపు మురారితో.. తాను జీవితాంతం కలిసి ఉండాలని గుడిలో కాయిన్ నిలబెట్టాలని అనుకుంటుంది ముకుంద. ఇది గమనించిన కృష్ణ.. ముకుంద కోరిక ఫలించదు అని ప్రూవ్ చేయడానికి మనం కూడా కాయిన్ నిలబెడదామని మురారితో చెప్తుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-36-jpg.webp)
Manchu Manoj : “నీ హృదయంలో నాకు, ధైరవ్ కు చోటిచ్చినందుకు థ్యాంక్స్”.. భూమా మౌనిక ఎమోషనల్ పోస్ట్
Follow Us