Krishna Mukunda Murari : ముకుంద మాస్టర్ స్కెచ్.. మళ్ళీ ఎంట్రీ.. ఒకరినొకరు కొట్టుకున్న ఆదర్శ్, మురారి మురారిని సొంతం చేసుకోవడానికి రూపం మార్చుకొని మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది ముకుంద. మరో వైపు తన భార్య చావుకు కారణం కృష్ణే అని నిందిస్తాడు ఆదర్శ్. భార్యను నిందించడం తట్టుకోలేకపోయిన మురారి ఆదర్శ్ పై కోప్పడతాడు. దీంతో ఒకరోనొకరు కొట్టుకుంటారు. ఇలా సీరియల్ ఆసక్తిగా సాగుతోంది. By Archana 18 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Krishna Mukunda Murari Today Episode : మురారి(Murari) ఒంటరిగా కూర్చొని ముకుంద(Mukunda) గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కృష్ణ(Krishna) వస్తుంది. భార్య రాగానే తనతో బాధను పంచుకుంటాడు ఆదర్శ్(Adarsh). ముకుంద చనిపోవడానికి, ఆదర్శ్ జీవితం ఇలా కావడానికి నేనే కారణం అంటూ కృష్ణకు చెప్తాడు. దీంతో ఒకరి తలరాతకు మరొకరు కారణం ఎప్పుడూ కారణం కాదు అని మురారికి దైర్యం చెప్తుంది కృష్ణ. మరో వైపు రేవతి(Revathi), నందిని(Nandini) కృష్ణను నిందిస్తూ ఆదర్శ్(Adarsh) మాట్లాడిన మాటలు తలుచుకొని బాధపడుతుంటారు. కృష్ణ ఏ తప్పు చేయలేదని ఆదర్శ్ కు అర్థమయ్యేలా చెప్పాలి.. లేదంటే ఇది ద్వేషంగా మారే ప్రమాదం ఉంటుంది అని భయపడుతుంది నందిని. రేవతి, నందు బాధపడడం గమనించిన మధు ఏమైందని అడుగుతాడు. దీంతో జరిగిన విషయం చెప్తుంది నందిని. ఆదర్శ్.. కృష్ణను అలా మాట్లాడాడని తెలుసుకున్న మధు కోపంతో ఊగిపోతాడు. అసలు కృష్ణ చేసిన తప్పేంటి, వాడికేమైనా పిచ్చి పట్టిందా అని తిడతాడు. కృష్ణ పై పగతీర్చుకోవాలని రగిలిపోతున్న ముకుంద.. దెయ్యంగా మారినట్లు నటిస్తూ మధు, మురారిని భయపెడుతుంది. మురారి, మధు ఈ విషయాన్నీ ఇంట్లో వాళ్లకు చెప్పడంతో అందరు టెన్షన్ పడతారు. భార్య చావుకు కృష్ణే కారణమని భావిస్తున్న ఆదర్శ్ ఇంట్లో ఉండలేకపోతాడు. అర్ధరాత్రి బయటకు వెళ్లాలని అనుకుంటాడు. దీంతో రేవతి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నిస్తుంది. ఇంతలో వచ్చిన మురారి కూడా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. మురారి, కృష్ణ పై కోపంగా ఉన్న ఆదర్శ్.. నీకు చెప్పాల్సిన అవసరం లేదు .. నువ్వు ఏదైనా చెప్పాలి అనుకుంటే.. నీ మాయలాడి భార్యకు చెప్పు అని కృష్ణ గురించి తప్పుగా మాట్లాడతాడు. భార్య గురించి అలా తప్పుగా మాట్లాడడం తట్టుకోలేకపోయిన మురారి ఆదర్శ్ కాలర్ పట్టుకుంటాడు. దీంతో ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో ముకుంద కొత్త రూపంతో ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. మరో వైపు మురారిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. Also Read : Venkatesh Daughter’s Marriage : ఘనంగా వెంకటేష్ చిన్న కూతురి పెళ్లి.. వైరలవుతున్న ఫొటోలు #krishna-mukunda-murari-today-episode #krishna-mukunda-murari-serial #tv-serial #daily-serial మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి