Krishna Mukunda Murari: భవానీ దేవికి షాకిచ్చిన ఆదర్శ్ ..! ముకుంద అసలు రూపం కృష్ణకు తెలియనుందా..?

ఆదర్శ్ ను తన వైపు తిప్పుకోవాలని కొత్త నాటకం మొదలు పెడుతుంది ముకుంద. మరో వైపు ఆస్తి తన పేరు పై రాయాలని భవానీ దేవిని డిమాండ్ చేస్తాడు ఆదర్శ్. దీంతో భవానీ దేవి చెంప చెల్లుమనిపిస్తుంది. ఇలా కృష్ణ ముకుంద సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Krishna Mukunda Murari: భవానీ దేవికి షాకిచ్చిన ఆదర్శ్ ..! ముకుంద అసలు రూపం కృష్ణకు తెలియనుందా..?

Krishna Mukunda Murari Serial: మధు.. ఆదర్శ్ ను ఇంట్లో మందు తాగకు అని చెప్పడంతో గొడవ చేస్తాడు. గట్టి గట్టి అరుస్తూ మధు పై సీరియస్ అవుతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన భవానీ దేవి ఏంటీ ఈ గొడవ అని అడుగుతుంది. దీంతో ఆదర్శ్ ఇంట్లో అందరికీ నేను లోకువైపోయాను.. నన్ను పరాయివాడిలా చూస్తున్నారు అని చెప్తాడు. నాకు అన్యాయం చేసిన వారికి ఉన్న విలువ కూడా నాకు లేదు అని కృష్ణ, మురారిని ఉద్దేశిస్తూ మాట్లాడతాడు.

Krishna Mukunda Murari

ఆదర్శ్ మాటలకు విసిగిపోయిన భవానీ దేవి.. ఇప్పుడు ఏం చేస్తే సొంత వాడిలా ఫీల్ అవుతావు అని అడుగుతుంది. దానికి ఆదర్శ్ ఈ ఆస్తి అంతా నా పేరు పై రాసివ్వాలి.. అప్పుడు ఈ ఇంట్లో ఎవరు ఉండాలో.. ఉండకూడదో నేనే డిసైడ్ చేయొచ్చు అని అంటాడు. దీంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు.

Krishna Mukunda Murari

కొడుకు మాటలకు కోపం వచ్చిన భవానీ దేవి.. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తా అని ఆదర్శ్ చెంప చెల్లుమనిపిస్తుంది. ఈ ఇంట్లో అందరూ నా ప్రాణం.. ఏ ఒక్కరిని వదులుకోవాల్సి వచ్చిన నా ప్రాణం పోయినట్టే అని కొడుకుకు వార్నింగ్ ఇస్తుంది.

Krishna Mukunda Murari

మరో వైపు ఆదర్శ్ ను ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తుంది ముకుంద. కృష్ణ, మురారిలా పై మరింత ద్వేషం పెరిగేలా మాట్లాడుతుంది. దీంతో ఆదర్శ్ వాళ్ళ పై కోపంతో రగిలిపోతాడు.

publive-image
ఇంతలో మురారి అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే కోపంతో ఊగిపోతాడు ఆదర్శ్. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్తాడు. ఆ తర్వాత మురారిని పక్కకు తీసుకెళ్లిన మీరా ( ముకుంద).. ఆదర్శ్ కోపంలో ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడితే అది ఎక్కువవుతుంది అని సర్ది చెప్పి పంపిస్తుంది.

publive-image

గదిలో ఒంటరిగా కూర్చున్న భవానీ దేవి.. ఆదర్శ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కృష్ణ రాగానే.. కుటుంబం అంతా కలిసి ఉండాలని నేను పాకులాడుతుంటే ముక్కలు చేయాలని వాడు అనుకుంటున్నాడు అని కృష్ణతో బాధపడుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో ముకుంద తండ్రి శ్రీనివాస్ తో మాట్లాడం కృష్ణ వింటుంది.

publive-image

Also Read: Paarijatha Parvam Movie: తిరుమలలో ‘పారిజాత పర్వం’ మూవీ టీమ్.. వైరలవుతున్న ఫొటోలు

Advertisment
Advertisment
తాజా కథనాలు