Krishna mukunda murari: సంతోషంలో ఉన్న మురారి, ఆదర్శ్ తాగేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. వాళ్ళ అవతారం గమనించిన కృష్ణ.. తాగారా ..? అంటూ మురారిని ప్రశ్నిస్తుంది. మురారి మాత్రం తగలేదని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు.
ఆ తర్వాత అందరు భోజనం చేయడానికి కూర్చుంటారు. ఇంతలో ముకుంద.. మురారిని వాలెంటైన్స్ డే కాన్సెప్ట్ గురించి అడుగుతుంది. మురారి మాత్రం ఇప్పుడే చెప్పేస్తే సర్ ప్రైజ్ ఏముంటుంది.. రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే అని చెప్తాడు. ఇటు కృష్ణ.. ఇది మీ ప్రేమకు పరీక్ష అనుకో.. ఇందులో మీరు ఫస్ట్ క్లాసులో పాస్ అవుతారని చెప్తుంది.
కృష్ణ అలా చెప్పడంతో.. ఆదర్శ్ తో క్లోజ్ గా ఉండాలలేమో అని భావించిన ముకుంద టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో ఆదర్శ్ రూమ్ లోకి రాగానే .. కాంపిటీషన్ గురించి మీకు మురారి ఏమైనా చెప్పాడా అని భర్తను అడుగుతుంది. తనకు కూడా ఏం చెప్పలేదని ఆదర్శ్ చెప్తాడు. ఇక భర్త పై ఇష్టం లేని ముకుంద దీని నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది.
ఉదయాన్నే కృష్ణ ఇంట్లో అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది. కాఫీ ఇస్తుండగా కృష్ణ వేలికి రింగ్ లేకపోవడం గమనించిన ముకుంద.. రింగ్ ఏదీ అని కృష్ణను అడుగుతుంది.
వేలికి ఉంగరం లేదని తెలుసుకున్న కృష్ణ ఇల్లంతా వెతుకుతుంది. ఎక్కడ చూసిన రింగ్ కనిపించకపోవడంతో కృష్ణ టెన్షన్ పడుతుంది. మరో వైపు ముకుంద మాత్రం ప్రేమికుల రోజున మురారి.. కృష్ణకు తొడిగిన రింగ్ పోయిందంటే.. నేను ఇంకా మురారి పై ఆశలు పెట్టుకోవచ్చా..? మురారి నా సొంతమేనా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా జరగడంతో ముకుంద మొహం వెలిగిపోతుంది.. కానీ వెంటనే నా ఆలోచనలు తప్పని ఫీల్ అవుతుంది ముకుంద .
కృష్ణ మాత్రం ఇంకా దాని గురించే ఆలోచిస్తూ ఉండడంతో.. మురారి కృష్ణకు దైర్యం చెప్తాడు. నువ్వు డల్ గా ఉంటే పార్టీ క్యాన్సిల్ చేస్తానని చెప్తాడు. దాంతో కృష్ణ.. నేను ఇంక బాధపడనని మురారికి చెప్తుంది.
వాలెంటైన్స్ డే కాంపిటీషన్ కోసం కావాల్సిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేస్తాడు మురారి. కృష్ణ , మురారి డెకరేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దూరం నుంచి మురారినే చూస్తున్న ముకుంద.. మురారితో ఇప్పుడే ఒక సెల్ఫీ తీసుకోవాలి.. తర్వాత ఎలా ఉంటుందో ఏమో అని ఆలోచిస్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: Sitara Gattamaneni: మహేశ్ కూతురు సితార పేరుతో ఫేక్ అకౌంట్స్.. నమ్రత పోస్ట్ వైరల్!