Game Changer : "జ‌ర‌గండి జ‌ర‌గండి".. గేమ్ ఛేంజర్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

డైరెక్టర్ శంకర్,మెగా పవర్ స్టార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం గేమ్ ఛేంజర్. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'గేమ్ ఛేంజర్' లోని ఫస్ట్ సాంగ్ "జ‌ర‌గండి జ‌ర‌గండి" లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

New Update
Game Changer : "జ‌ర‌గండి జ‌ర‌గండి".. గేమ్ ఛేంజర్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

Game Changer : తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar) దర్శకత్వంలో గ్లోబల్ స్టార్(Global Star) రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గేమ్ ఛేంజర్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రొడ్యూసర్  దిల్ రాజ్(Dil Raju) నిర్మిస్తున్నారు. శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది.

"జ‌ర‌గండి జ‌ర‌గండి" లిరికల్ వీడియో

Game Changer

అయితే నేడు రామ్ చరణ్ పుట్టినరోజు(HBD Ram Charan) సందర్భంగా గేమ్ ఛేంజర్ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమాలోని ఫస్ట్ సాంగ్ "జ‌ర‌గండి జ‌ర‌గండి" లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. మాస్ బీట్, క్లాసీ లిరిక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ పాట. సాంగ్ లో కియార(Kiara), చరణ్ విజువల్స్ అద్భుతంగా కనిపించాయి. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్  రాయగా.. థమన్ సంగీతం అందించారు. ద‌లేర్ మెహందీ, సునిధీ చౌహాన్ ఆల‌పించారు. విడుదలైన క్షణాల్లోనే టాప్ 1 ట్రెండింగ్ లో కొనసాగుతుంది ఈ సాంగ్.

Ram Charan - Kiara

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా కథానాయికగా నటించగా.. నటి అంజలి మరో కీలక పాత్ర పోషిస్తుంది. బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌, ఎస్‌జే సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, జ‌య‌రాయ్‌, సునీల్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Also Read : HBD Ram Charan Teja : మెగా పవర్ నుంచి గ్లోబల్ స్టార్.. రామ్ చరణ్ సినీ ప్రస్థానం ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు