Komatireddy Rajagopal Reddy: వారి గడీలు బద్లలయ్యే రోజు దగ్గర్లోనే ఉంది

సీఎం కేసీఆర్‌పై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను నియంత పరిపాలిస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో నియంత పాలన ముగియబోతోందని, దొరల గడీలు బద్దలయ్యే రోజు దగ్గర్లోనే ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చేప్పారు.

New Update
Telangana Elections: అందుకే కాంగ్రెస్‌లోకి పోతున్నా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

సీఎం కేసీఆర్‌పై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను నియంత పరిపాలిస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో నియంత పాలన ముగియబోతోందని, దొరల గడీలు బద్దలయ్యే రోజు దగ్గర్లోనే ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చేప్పారు. కేసీఆర్‌ నియంత పాలన గురించి ప్రజలకు అర్దమైందన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో జరగుతున్న అవినీతి గురించి సైతం ప్రజలకు తెలిసిపోంయిదని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో బాగుపడ్డది కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే అన్న ఆయన.. తమ కలలను సాకారం చేసుకోవడం కోసం పోరాటాలు చేసిన విద్యార్థులు, నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ఇక నిరుద్యోగులు కేసీఆర్‌కు ఓటు వేసే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వానికి పరీక్షలు కూడా నిర్వహించడం చేతకావడంలేదని కోమటరెడ్డి మండిపడ్డారు. పది పరీక్షల్లో పేపర్‌ లీకేజీలు ఉన్నాయన్న ఆయన.. ఇటీవల జరిగిన టెట్‌ పరీక్షల్లో సైత ఒక దానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇచ్చారన్నారు.

అంతే కాకుండా టీఎస్‌పీఎస్సీలో ఏకంగా బోర్డు సభ్యుల సంతకాలు సైత ఫోర్జరీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు రాకపోవడంతో వారి కుటుంబాలను పోషించుకోవడానికి డబ్బులు లేక లంచాలకు అలవాటు పడుతున్నారన్నారు. అందులో భాగంగానే పేపర్ లీకేజీ ఘటనలు జరుగుతున్నాయని కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు