Telangana Elections: అందుకే కాంగ్రెస్‌లోకి పోతున్నా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

ప్రజాభిష్టం మేరకే బీజేపీకి బైబై చెప్పి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ మాత్రమే ఉందని ప్రజలు అలానే ఆలోచిస్తున్నారని చెప్పారు. అందుకే వారి ఆలోచనలకు అనుగుణంగానే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు.కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే తన ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

Telangana Elections: అందుకే కాంగ్రెస్‌లోకి పోతున్నా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
New Update

Telangana Elections: గత కొద్ది కాలంగా బీజేపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajgopal Reddy) పార్టీ వీడతారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో .. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నానని, మళ్లీ కాంగ్రెస్‌లో చేరబోతున్నానని ప్రకటించారు. పార్టీ మార్పుపై స్పష్టత ఇస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఓ లేఖను విడుదల చేశారు. కేసీఆర్ దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలనే లక్ష్యంతోనే పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. 27న ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది ఆయన మునుగోడు నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాలరెడ్డి పార్టీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రతిష్ఠాత్మకంగా సాగిన మునుగోడు ఉపఎన్నిక పోరులో బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా బీజేపీపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన బీజేపీని వీడతారని, సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా అందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని ప్రచారమైంది. ఆయన ఆయా ప్రకటనలను ఖండిస్తూ వచ్చారు. మునుగోడు టిక్కెట్ కు హామీ లభించటం వల్లనే ఇప్పుడు రాజగోపాలరెడ్డి పార్టీ మారారని పలువురు చెబుతున్నారు.

బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌..

ప్రజాభిష్టం మేరకే బీజేపీకి బైబై చెప్పి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ మాత్రమే ఉందని ప్రజలు అలానే ఆలోచిస్తున్నారని చెప్పారు. అందుకే వారి ఆలోచనలకు అనుగుణంగానే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు.కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే తన ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇదికూడా చదవండి: వాసివాడి తస్సాదియ్యా.. పొలిటికల్ పార్టీల పెండ్లి.. శుభలేఖ చూస్తే అవాక్కవ్వాల్సిందే..!

బీజేపీని నిందించటం సరికాదు: కిషన్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఖండించారు. ఆయన అన్నంత మాత్రాన బీఆర్‌ఎస్‌​కు.. బీజేపీ పోటీ కాకుండా పోతుందా..? అని ప్రశ్నించారు. పార్టీలో ఉండటం, వీడటం ఎవరి ఇష్టం వారిదని అన్నారు. జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డి పార్టీని నిందించటం సరికాదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ఇలాంటి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పారు. తాను చనిపోయే వరకు బీజేపీలోనే ఉంటానని వ్యాఖ్యానించిన రాజగోపాల్ రెడ్డి పార్టీని ఎందుకు వీడారో, ఆయననే అడిగి తెలుసుకోవాలని బీజేపీ నేత ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. రాజగోపాల్ ఒక పాసింగ్​ క్లౌడ్​ లాంటివాడని.. మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి అభివర్ణించారు. పార్టీ ఎప్పుడూ బలంగానే ఉంటుందని, కొందరు అలా వచ్చి ఇలా వెళ్తారని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని.. బీజేపీ తరఫున ఎంపీగానే పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

నేను పార్టీ మారటం లేదు : వివేక్

పార్టీ మారుతారన్న ప్రచారంపై భాజపా నేత, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి స్పందించారు. తాను పార్టీ మారుతారన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతుందని.. అదంతా తప్పని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా గురించి తనకు తెలియదని వివేక్‌ తెలిపారు.

ఇదికూడా చదవండి: అత్యధి మైలేజీ కార్ల కోసం చూస్తున్నారా? బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలు మీకోసం..

#brs #congress #bjp #komatreddy-rajgopal-reddy #telangana-politic
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe