సీఎం అభ్యర్థిపై కోమటిరెడ్డి, డీకే శివకుమార్ సంచలన ప్రకటన

తెలంగాణలో కాంగ్రెస్ విజయం దాదాపు ఖరారైంది. దీంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారంపై స్పందించిన కోమటిరెడ్డి, డీకే శివకుమార్ లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత తదుపరి కార్యాచరణను కేంద్ర అధినాయకత్వం నిర్ణయం మేరకు తీసుకుంటామని తెలిపారు.

New Update
సీఎం అభ్యర్థిపై కోమటిరెడ్డి, డీకే శివకుమార్ సంచలన ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ ఫలితాలపై ఉత్కంఠ వీడింది. అందరూ ఊహించినట్లే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో దూసుకుపోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే డీజీపీ అంజనీ కుమార్ రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్పడం విశేషం. కాగా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం అభ్యర్థిపై పెద్ద ఎత్తున్న చర్చ నడుస్తోంది. ప్రజలంతా రేవంత్ రెడ్డినే సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరు ముఖ్యమంత్రి కావాలనే విషయంపై అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ విజయాన్ని సోనియాగాంధీకి బర్త్‌డే గిఫ్ట్‌ ఇస్తున్నామన్నారు. నేను సీఎం రేసులో ఉన్నానా? లేదా? అన్నది అప్రస్తుతం. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాబట్టే డీజీపీ కలిశారు' అని తన అభిప్రాయం వెల్లడించారు.

Also read :కాంగ్రెస్ ధీమా.. ఎమ్మెల్యేల క్యాంప్ కోసం 3 బస్సులు రెడీ!

ఇక ఇదే విషయంపై మాట్లాడిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి. హనుమంతరావు.. రేవంత్ రెడ్డినే సీఎం అవుతారని, ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించాడన్నారు. అందుకే తాను ముఖ్యమంత్రిగా రేవంత్ కే మద్ధతు పలుకుతున్నట్లు ఓపెన్ గా చెప్పేశారు. ఇదిలావుంటే.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణను కేంద్ర అధినాయకత్వం నిర్ణయం మేరకు తీసుకుంటామని అన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌లకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఇప్పుడు దాని గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదన్నారు. అలాగే గతంలో పార్టీని అవమాన పరిచేలా వాళ్లు పెట్టిన ట్వీట్లకు తెలంగాణ ప్రజలు ఇప్పటికే సమాధానం ఇచ్చేశారని, పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాతే తాము సమాధానం ఇస్తామని చెప్పారు.

Advertisment
తాజా కథనాలు