/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-19T183910.842.jpg)
Thangalaan Movie Release Date Announced : కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘తంగలాన్’ (Thangalaan). 19వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్ విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. ట్రైలర్ లో విక్రమ్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవెల్ లో కనిపించాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘తంగలాన్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.
'తంగలాన్' రిలీజ్ డేట్
తాజాగా చిత్రబృందం మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల పలు సార్లు వాయిదా పడింది. మొదటగా జనవరి 26 విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేయగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా వేసి మళ్ళీ ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేశారు. ఇక చివరికి ఆగస్టు 15 ఇండిపెండెన్స్ రోజున చేయనున్నట్లు ప్రకటించారు. ఆగస్టు బరిలో 'డబుల్ ఇస్మార్ట్', స్త్రీ 2 తో పాటు 'తంగలాన్' కూడా వచ్చేస్తుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూడు సినిమాలకు క్లాష్ ఏర్పడే అవకాశం ఉంది.
Rising from the ashes, to whisper loud the truth 🔥#Thangalaan is releasing worldwide on August 15th.#ThangalaanFromAug15 💙@Thangalaan @chiyaan @GnanavelrajaKe @StudioGreen2 @OfficialNeelam @parvatweets @MalavikaM_ @gvprakash @NehaGnanavel @dhananjayang @NetflixIndia… pic.twitter.com/UF1BXWNaaL
— pa.ranjith (@beemji) July 19, 2024