Ajith Kumar : 'KGF' యూనివర్స్ లోకి కోలీవుడ్ స్టార్.. ప్రశాంత్ నీల్ తో ఏకంగా రెండు సినిమాలు?

‘కేజీయఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌తో కోలీవుడ్ స్టార్ అజిత్‌ రెండు సినిమాలు చేయనున్నట్లు సమాచారం. అందులో ఒకటి ‘కేజీయఫ్‌’ యూనివర్స్‌కు సంబంధించిన కథ అని.. మరొకటి విభిన్నమైన కథాంశం స్టాండలోన్‌ మూవీ అని తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు కూడా జరిగినట్లు ప్రచారం సాగుతుంది.

Ajith Kumar : 'KGF' యూనివర్స్ లోకి కోలీవుడ్ స్టార్.. ప్రశాంత్ నీల్ తో ఏకంగా రెండు సినిమాలు?
New Update

Kollywood Star Ajith Joins KGF Universe : కన్నడ హీరో యష్ నటించిన 'కేజీయఫ్‌' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, కథనం, సంగీతం తో పాటు, రాకీ పాత్రలో యశ్ నటనకు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ చిత్రం విజయంతో, 'కేజీయఫ్‌' యూనివర్స్ అనే ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్ పుట్టుకొచ్చింది.

ఇప్పుడు, ఈ యూనివర్స్‌లోకి తమిళ స్టార్ హీరో అజిత్ రాబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అజిత్ 'కేజీయఫ్‌ 3' లో (KGF 3) ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని అంటున్నారు. ఆయనకు ఈ యూనివర్స్‌లో కొత్త పాత్ర ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ప్రశాంత్‌నీల్‌తో (Prashanth Neel) అజిత్‌ ఏకంగా రెండు సినిమాలు చేయనున్నట్లు సమాచారం.

Also Read : ‘మా’ సంచలన నిర్ణయం.. మరో 18 యూట్యూబ్ ఛానల్స్ అవుట్..!

అందులో ఒకటి ‘కేజీయఫ్‌’ యూనివర్స్‌కు సంబంధించిన కథ అని.. మరొకటి విభిన్నమైన కథాంశం స్టాండలోన్‌ మూవీ అని తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు కూడా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినప్పటికీ, ఈ వార్తలతో 'కేజీయఫ్‌' అభిమానులు ఆనందంతో ఊగిపోతున్నారు.

అజిత్ రాక 'కేజీయఫ్‌' యూనివర్స్‌కు మరింత పాన్-ఇండియా గుర్తింపు తెస్తుందని నమ్ముతున్నారు. ఆయన నటనా ప్రతిభ, స్టార్ క్రేజ్ తో ఈ యూనివర్స్‌ మరింత ఎత్తుకు ఎదగడానికి అవకాశం ఉంది. 'KGF 3' లో అజిత్ ఎలాంటి పాత్రలో నటిస్తారో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Also Read : విజయ్ దేవరకొండతో వివాదం.. మరోసారి స్పందించిన అనసూయ, ఈసారి ఏం చెప్పిందంటే?

#kgf-3 #kollywood-actor-ajith #prashanth-neel
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe