Kolkata Doctor Case: డాక్టర్ హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీ

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

New Update
Kolkata Doctor Case: డాక్టర్ హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీ

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలాఉండగా.. ఈ ఘటన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. ఈ కేసులో భాగంగా ఆర్జీకార్‌ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ ఘోష్‌తో సహా అభయతో చివరిసారిగా ఉన్న మరో నలుగురు డాక్టర్లను విచారిస్తోంది. అయితే సందీప్‌ ఘోష్ అధికారులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వీళ్లందరికీ పాలిగ్రాఫ్ టెస్ట్ (లై డిటెక్టర్ టెస్ట్) చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే సీబీఐ చేసిన విజ్ఞప్తికి కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు కూడా వీళ్లకు ఈ టెస్టు చేసేందుకు అనుమతి ఇచ్చింది.

Also Read: స్కూల్‌ బాల్కనీ కూలి 40 మంది చిన్నారులు!

అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్‌ రాయ్‌కు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు ఇప్పటికే కోర్టు నుంచి పర్మిషన్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే వీళ్లకి ఈ టెస్టు చేసేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. మరో విషయం ఏంటంటే వాస్తవానికి పాలిగ్రాఫ్‌ టెస్ట్‌ ద్వారా అధికారులు సేకరించిన వివరాలను కోర్టులు అంగీకరించవు. కానీ ఈ కేసులో కీలక ఆధారాలను గుర్తించేందుకు ఈ టెస్టు ఉపయోగపడుతందనే కారణంతోనే సీబీఐ ఈ విధానాన్ని ఎంచుకుంది.

Also Read: సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Advertisment
Advertisment
తాజా కథనాలు