Balcony Collapsed: స్కూల్‌ బాల్కనీ కూలి 40 మంది చిన్నారులు!

యూపీలోని బారాబంకి అవధ్‌ అకాడమీ స్కూల్‌ బాల్కనీ కూలిపోవడంతో 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. పాఠశాలలో జరిగే ప్రార్థనకు హాజరయ్యేందుకు విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి కిందకి వస్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థుల్లో ప్రస్తుతం ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

New Update
Balcony Collapsed: స్కూల్‌ బాల్కనీ కూలి 40 మంది చిన్నారులు!

Balcony Collapsed : యూపీలోని బారాబంకి జిల్లాల్లో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. అవధ్‌ అకాడమీ స్కూల్‌ బాల్కనీ కూలిపోవడంతో 40 మంది చిన్నారులు శిథిలాల కింద ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 8 గంటలకు పాఠశాలలో ప్రార్థన నిర్వహించేందుకు తరగతి గదుల నుంచి విద్యార్థులు బయటకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

తీవ్రంగా గాయపడిన వారిలో ఐదుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిన్నారుల అరుపులు విని పాఠశాల చుట్టుపక్కల ప్రజలు సాయం చేసేందుకు తరలి వచ్చారు. ప్రజలు పిల్లలను కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. ఈ పాఠశాలలో 400 మంది పిల్లలు చదువుతున్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దినేష్ కుమార్ సింగ్ వివరించారు.

విద్యార్థుల తరగతులు గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో జరుగుతాయి. మొదటి అంతస్తు నుంచి కిందకు రావాలంటే బాల్కనీ లో నుంచే రావాలి. పక్కనే మెట్లున్నాయి. పిల్లలు బాల్కనీలో ఉండగా బరువు పెరిగి 15 అడుగుల కింద పడిపోయారు. పిల్లలందరినీ సమీప ఆసుపత్రిలో చేర్చారు. పాఠశాల యాజమాన్యాన్ని అధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: నేపాల్‌లో ఘోర ప్రమాదం

Advertisment
తాజా కథనాలు