Visakhapatnam: విశాఖలో బెంగాల్ విద్యార్థిని సూసైడ్.. అది ఆత్మహత్యా? హత్యా?

విశాఖ పట్నం నరసింహ నగర్ లోని సాధనా హాస్టల్ లో గత నెల 14వ తేదీన బెంగాల్ కు చెందిన ఇంటర్ విద్యార్థిని రితీ సాహా అనుమానస్పద స్థితిలో మృతి చెంది. అయితే అది ఆత్మహత్య కాదు.. హత్య అని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రితీ సాహా పేరెంట్స్ ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫిర్యాదు చేశారు. దీంతో బెంగాల్ లోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించిన బెంగాల్ సీఎం.. విచారణ కోసం ఒక టీమ్ ను విశాఖ పంపిస్తున్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిన సంబంధిత విశాఖ నాల్గవ పట్టణ పోలీసులు అక్కడకు వెళ్లిన మీడియాను నియంత్రించే ప్రయత్నం చేస్తుండడం మరింత అనుమానాలకు తావిస్తోంది.

New Update
Visakhapatnam: విశాఖలో బెంగాల్ విద్యార్థిని సూసైడ్.. అది ఆత్మహత్యా? హత్యా?

Kolkata Police Register Case into Death of Student in Visakhapatnam: విశాఖ పట్నం నరసింహ నగర్ లోని సాధనా హాస్టల్ లో గత నెల 14వ తేదీన బెంగాల్ కు చెందిన ఇంటర్ విద్యార్థిని రితీ సాహా అనుమానస్పద స్థితిలో మృతి చెంది. అయితే అది ఆత్మహత్య కాదు.. హత్య అని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రితీ సాహా పేరెంట్స్ ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫిర్యాదు చేశారు. దీంతో బెంగాల్ లోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించిన బెంగాల్ సీఎం.. విచారణ కోసం ఒక టీమ్ ను విశాఖ పంపిస్తున్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిన సంబంధిత విశాఖ నాల్గవ పట్టణ పోలీసులు అక్కడకు వెళ్లిన మీడియాను నియంత్రించే ప్రయత్నం చేస్తుండడం మరింత అనుమానాలకు తావిస్తోంది.

కోల్ కత్తాలో కేసు నమోదు: 

పశ్చిమ బెంగాల్ కు చెందిన రితీ సాహా ఆకాష్ బైజూస్ లో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. రితీ బైజూస్ కు అనుసంధానంగా ఉన్న సాధనా హాస్టల్ లో ఉంటోంది. గతల నెల 14న హాస్టల్ 4వ అంతస్తుపై నుంచి దూకి చనిపోయిందని తల్లిదండ్రులకు హాస్టల్ యాజమాన్యం తెలిపింది. హుటాహుటిన బెంగాల్ నుంచి వచ్చి తల్లిదండ్రులు.. విగత జీవిగా పడి ఉన్న రితీని చూసి కన్నీరుమున్నీరయ్యారు. రితీ మృతిపై వారు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నారు.హాస్టల్ సిబ్బంది, పోలీసులు చెప్తున్న దానిపై అనేక అనుమానాలు వచ్చాయి.

ఈ కేసుపై సీఎం మమతా బెనర్జీ ప్రెస్ మీట్:

నాలుగో అంతస్తు పైకి వెళ్ళే సమయంలో రితీ ఒక డ్రెస్ లో ఉన్నట్టు హాస్టల్ సీ సీ పుటేజ్ లో కనిపించగా.. కింద పడి ఉన్న మృత దేహంపై మరో కలర్ డ్రెస్ ఉన్నట్టు ఆ భవనానికి ఎదురుగా ఉన్న బిల్డింగ్ సీసీ పుటేజ్ లో ఉన్నట్టు మృతు రాలి తల్లి తండ్రులు చెప్తున్నారు. ఆ విషయాన్ని పోలీసులకు చెబితే పట్టించుకోవడం లేదనీ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ ల పై నమ్మకం లేదంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కి ఫిర్యాదు చేశారు తల్లితండ్రులు. దీంతో కలకత్తాలో ఈ హత్య కేసుపై మమతా బెనర్జీ మాట్లాడారు. బెంగాల్ మంత్రి అనూప్ ను ఏకంగా రితీ సాహా ఇంటికి పంపించారు.

కోల్ కత్తా నేతాజీ నగర్ పీ ఎస్ లో రితీ సాహా అనుమానస్పద మృతిపై కేసు నమోదు కావడం పై విశాఖ పోలీస్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. స్థానిక పోలీస్ అధికారుల వ్యవహార శైలి పై మృతురాలి తల్లితండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. మేము అక్కడ ఉన్నప్పుడు ఒక నల్లటి కార్ లో వచ్చిన వ్యక్తులకు బ్యాగ్‌ లలో డబ్బులు పంపారని, వాళ్ళు పోలీస్ అధికారులకు చెందిన మనుషులు అని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఒక రాష్ట్రంలో జరిగిన ఘటనలపై వేరే రాష్ట్రంలో కేసులు నమోదు కావడం అరుదు..అలాంటిది కలకత్ లో కేసు నమోదు కావడం, స్థానిక పోలీసులపై ఆరోపణలు రావడం లాంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

ఇది హత్యనే విద్యార్థిని తల్లిదండ్రులు:

రితీ సాహాను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. కాలేజ్, హాస్టల్ నిర్వాహకుల నుంచి పోలీసులు డబ్బులు తీసుకొని కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విద్యార్థిని తల్లిదండ్రులు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సీఎం త్రివిక్రమ్ వర్మకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు