అత్యంత సేఫ్ సిటీగా కోల్ కతా.. హైదరాబాద్ కు ఎన్నో స్థానం తెలుసా? భారతదేశంలో అత్యంత సురక్షిత నగరంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతా నిలిచింది. భారత్ దేశంలో నేరాలకు సంబధించి ‘క్రైమ్ ఇన్ ఇండియా 2022' విడుదల చేసిన జాబితాలో కోల్ కతా మొదటి స్థానం దక్కించుకోగా.. పుణె రెండు, హైదరాబాద్ మూడో ప్లేస్ లో నిలిచాయి. By srinivas 05 Dec 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి NCRB : దేశవ్యాప్తంగా నగరాల్లో జరుగుతున్న నేరాలు, ఘోరాలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (National Crime Records Bureau NCRB) ‘క్రైమ్ ఇన్ ఇండియా 2022 (Crime in India 2022)' ఒక నివేదిక రిలీజ్ చేసింది. 2022లో దేశంలో అత్యంత సేఫ్ నగరంలో కోల్ కతా అని తేల్చింది. ఎన్సీఆర్బీ రికార్డ్స్ లో కోల్ కతా అత్యంత సురక్షిత నగరంగా నిలవడం వరుసగా ఇది మూడో సంవత్సరం. కాగా 34 మర్డర్ కేసులు, 11 రేప్ కేసులు నమోదైనట్లు తెలిపింది. Also read :ఒక పోస్ట్..లక్షలు, కోట్లలో ఆదాయం-సోషల్ మీడియా మహారాణులు మహిళలపై నేరాలు కోల్ కతాలో 2022 లో పెరిగాయి. ఈ నగరంలో ప్రతీ లక్ష జనాభాకు 2022 లో మహిళలపై 1890 నేరాలు జరగగా, 2021 లో 1783 నేరాలు జరిగాయి. అలాగే, కోల్ కతాలో 2022 లో 34 మర్డర్ కేసులు, 11 రేప్ కేసులు నమోదయ్యాయి. కోల్ కతా లో 2022 లో ప్రతీ లక్ష జనాభాకు 86.5 కేసు వేయదగిన నేరాలు (Cognisable Crimes) జరిగాయి. ఈ కాగ్నిజబుల్ క్రైమ్స్ అంటే ఐపీసీ, లేదా ప్రత్యేక, లేదా స్థానిక చట్టాల ప్రకారం కేసు వేయదగ్గ నేరాలని అర్థం. కోల్ కతాలో 2021 లో ప్రతీ లక్ష జనాభాకు 103.4 నేరాలు, 2020లో ప్రతీ లక్ష జనాభాకు 129.5 నేరాలు చోటు చేసుకున్నాయి. 2022లో పుణెలో ప్రతీ లక్ష జనాభాకు 280.7 కేసు వేయదగిన నేరాలు జరగగా, హైదరాబాద్ లో ప్రతీ లక్ష జనాభాకు 299.2 కేసు వేయదగిన నేరాలు (Cognisable Crimes) జరిగాయి. పుణెలో 2021 లో ప్రతీ లక్ష జనాభాకు 256.8 నేరాలు, హైదరాబాద్ (Hyderabad)లో 2021 లో ప్రతీ లక్ష జనాభాకు 259.9 నేరాలు చోటు చేసుకున్నాయి. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న మొత్తం 19 నగరాల్లోని నేరాలను పరిగణించి, ఎన్సీఆర్బీ (NCRB) ఈ జాబితాను విడుదల చేసింది. #hyderabad #kolkata #ncrb #safest-city #crimes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి